పార్టీ సెంట్ర‌ల్ ఆఫీస్ ఇన్‌చార్జ్‌గా లేళ్ల అప్పిరెడ్డి, సోష‌ల్ మీడియా కోఆర్డినేట‌ర్‌గా స‌జ్జ‌ల భార్గ‌వ రెడ్డి

తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆదేశాల మేర‌కు పార్టీలో ప‌లు కీల‌క ప‌ద‌వుల‌కు నియామ‌కాలు చేప‌ట్టారు. వైయ‌స్ఆర్ సీపీ కేంద్ర కార్యాల‌య ఇన్‌చార్జ్‌గా పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్సీ లేళ్ల‌ అప్పిరెడ్డి నియ‌మితుల‌య్యారు. అదే విధంగా పార్టీ సోష‌ల్ మీడియా మ‌రియు మీడియా కో-ఆర్డినేట‌ర్‌గా స‌జ్జ‌ల భార్గ‌వ రెడ్డి నియ‌మితుల‌య్యారు. ఎన్టీఆర్ జిల్లా యువ‌జ‌న విభాగం అధ్య‌క్షులుగా కొరివి చైత‌న్యను నియ‌మించారు. వీరి నియామ‌కాల‌కు సంబంధించి పార్టీ కేంద్ర కార్యాల‌యం నుంచి ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌లైంది. 

Back to Top