శ్రీబాగ్‌ ఒప్పందం తరహాలో సీఎం వైయస్‌ జగన్‌ మంత్రివర్గం

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను డిప్యూటీ సీఎంలను చేసిన ఘనత వైయస్‌ జగన్‌ది

ప్రభుత్వంపై బురదజల్లాలనే చంద్రబాబు తాపత్రయమంతా..

ఈ ప్రక్రియలో తన అనుభవం, సీనియారిటీని ఎప్పుడో కోల్పోయారు

బీసీలంటే బాబుకెందుకంత తిరస్కారభావం

మహానాడు వేదికగా ప్రభుత్వంపై దుష్ప్రచారానికి టీడీపీ కుట్ర చేస్తోంది

శాసనమండలి చీఫ్‌ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

తాడేపల్లి: ప్రభుత్వంపై ఏదో విధంగా బురదజల్లాలని, ప్రజల దృష్టిని తనవైపుకు తిప్పుకోవాలని ప్రతిపక్షనేత చంద్రబాబు తాపత్రయపడుతున్నారని, ఇందుకు మహానాడును వేదిక చేసుకోవాలని ఆత్రుతపడుతున్నారని శాసనమండలి చీఫ్‌ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ప్రజల క్షేమం కోసం పనిచేస్తున్న ప్రభుత్వంపై నిందలు వేస్తూ.. చంద్రబాబు తనస్థాయిని, తన సీనియారిటీని ఎప్పుడో దిగజార్చుకున్నాడన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అన్నివర్గాల సంక్షేమానికి పాటుపడుతున్నారని, 2019 ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 60 శాతం సీట్లు ఇచ్చారని, మంత్రి వర్గంలో కూడా 60 శాతం సముశ్చితస్థానం కల్పించారని గుర్తుచేశారు. చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో మైనార్టీకి మంత్రివర్గంలో స్థానం కల్పించలేదని, ఎస్టీ ఎమ్మెల్యే హత్యకు గురైతే.. అతని కుమారుడిని చివర్లో మంత్రివర్గంలోకి తీసుకున్నారన్నారు. 

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే.. 

ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, పథకాల గురించి ఏదో విధంగా తప్పుడు సంకేతాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలనే తపన, ఆత్రుత చంద్రబాబులో ఎక్కువ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎంతోకాలంగా తెలుగుదేశం పార్టీ ఆనవాయితీగా వస్తున్న మహానాడును కూడా 27, 28 తేదీల్లో జరుపుకోబోతున్నారు. మహానాడులో  60 పేజీల మేనిఫెస్టో, 68 పేజీల మహానాడు తీర్మానాలు వేస్తున్నారు. 

60 పేజీల మేనిఫెస్టో చూసిన ఈ రాష్ట్ర ప్రజానీకం అత్యంత ఘోరంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని సంవత్సరం క్రితం తిరస్కరించింది. మేనిఫెస్టోలో చెప్పినదాన్ని కూడా ప్రజలు స్వీకరిస్తారని, వాస్తవాలని అనుకుంటారని విశ్వసించడం లేదు. గతం నుంచి కొన్ని కొన్ని విషయాలు చూస్తే.. చంద్రబాబు పదే పదే నాది 40 సంవత్సరాల పొలిటికల్‌ ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్నాడు. వైయస్‌ జగన్‌కు సీనియరిటీ లేదు.. పరిపాలన అనుభవం లేదని వ్యత్యాసం చూపాలనుకుంటున్నాడు. 

బహుశా చంద్రబాబుది 40 ఇండస్ట్రీ కాదు.. 43 సంవత్సరాల అనుభవం ఉంది. బాబు మొట్టమొదటి సారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసింది 1978లో.. మహానేత వైయస్‌ఆర్‌ కూడా అప్పుడే పోటీ చేశారు. అప్పటి నుంచి చూసుకుంటే 43వ అనుభవం. సీనియారిటీ పెరిగే కొద్ది రాజకీయవేత్త అంటే స్టేట్‌మెన్‌షిప్‌కు ఎదగాలి. ఒక సీనియర్‌ ఒక విషయం మీద మాట్లాడుతున్నాడంటే.. మిగతావారికి ఆయన చెప్పేది కరెక్టు అనే అభిప్రాయం రావాలి. 

పరిపాలనలో ఉన్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఏదో విధంగా కించపరుస్తూ.. అవహేళన చేస్తూ మాట్లాడే విధానం తప్ప వాస్తవాలు ప్రతిబింబించేలా చంద్రబాబు ఎక్కడా మాట్లాడటం లేదు. ఆయనస్థాయికి తగని మాటలు కూడా మాట్లాడాడు. ఇటీవల చూస్తుంటే.. కంపార్‌ చేసుకుంటున్నాడు. టీడీపీ తీర్మానాల్లోని మూడవ పేజీలో.. బలపీటం మీద బడుగుల సంక్షేమం అని తీర్మానం ప్రవేశపెడుతున్నారు. చంద్రబాబుతో ఆరోజుల్లో నేను కూడా వరంగల్‌లో టీడీపీ తరుఫున బీసీ సదస్సు జరిగింది. ఆ వేదిక సాక్షిగా 50 శాతం బీసీలకు సీట్లు ఇస్తానని చెప్పాడు. ఎన్ని సీట్లు ఇచ్చారు.. ఎందుకు ఇవ్వలేకపోయారు..? బీసీలంటే తిరస్కారభావం ఉందా..? చెప్పిన మాటకు.. చేతలకు ఎంత తేడా ఉంటుందో.. చంద్రబాబే నిదర్శనం. ఆ రోజున 50 శాతమని చెప్పి 29 శాతం మాత్రమే ఇచ్చాడు. 

2019 ఎన్నికల్లో వైయస్‌ జగన్‌ 60 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు టికెట్లు ఇచ్చారు.. మంత్రివర్గంలో స్థానాలు ఇచ్చారు. మంత్రివర్గంలో అత్యంత ముఖ్యమైన శాఖలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చారు. వైయస్‌ జగన్‌ కేటాయించిన శాఖలు చూస్తే.. 1937లో మద్రాస్‌లో కూర్చొని పెద్దమనుషుల (శ్రీబాగ్‌) ఒప్పందంలో.. ఏయే శాఖలు ఏ ప్రాంతం వారికి ఇవ్వాలనే చిన్న విషయాన్ని కూడా రోజున వారు చర్చించారు. హోంమినిస్టరీ, రెవెన్యూ, ఫైనాన్స్‌ ఇటువంటి శాఖలు ఏ ప్రాంతం వారికి ఇవ్వాలి.. ఇవన్నీ చర్చించుకొని ఇచ్చారు. ఈ రోజున చూస్తే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వర్గాలకు నాలుగు ఉపముఖ్యమంత్రి పదవులు సీఎం వైయస్‌ జగన్‌ ఇచ్చారు. 

2014 నుంచి 19 వరకు జరిగిన చంద్రబాబు పాలనలో.. చివరి వరకు ఒక్క మైనార్టీకి మంత్రివర్గంలో స్థానం ఇవ్వలేదు. ఎస్టీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర్‌రావు హత్యకు గురయితే అతని కొడుక్కు చివర్లో మంత్రి పదవి ఇచ్చారు. కానీ, సీఎం వైయస్‌ జగన్‌ ఆ విధంగా చేయలేదు. సమాజంలో దగాకు గురవుతున్న కిందివర్గాలకు రాజకీయంగా ప్రాధాన్యతలు ఇవ్వాలని, ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి వాళ్లకు ఉన్నతస్థాయిలో కూర్చోబెట్టారు. హోంమంత్రి, ఎడ్యుకేషన్, ఎక్సైజ్‌శాఖ ఎస్సీలకు ఇచ్చారు. బీసీలకు అతికీలకమైన శాఖలు ఇచ్చారు’ అని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. 
 

Back to Top