వైద్యుల సూచ‌న‌లు పాటిస్తూ ధైర్యంగా ఉండండి

కరోనా బారి నుంచి కోలుకున్న స్పీకర్‌ తమ్మినేని

శ్రీకాకుళం: శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం దంపతులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. మెడికవర్‌ ఆస్పత్రి వైద్యుల పర్యవేక్షణలో కోవిడ్‌ చికిత్స తీసుకున్న స్పీకర్‌ తమ్మినేని సీతారాం దంపతులు పూర్తి ఆరోగ్యవంతులయ్యారు. ఈ సందర్భంగా స్పీకర్‌ మాట్లాడుతూ.. కరోనాపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వైద్యుల సలహాలు, సూచ‌న‌లు పాటిస్తూ ధైర్యంగా ఉండాలని సూచించారు. కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు రాజకీయ నేతలు ధైర్యం చెప్పాలన్నారు. ప్రజల్లో భయాందోళనలు కలిగించడం చంద్రబాబు మానుకోవాలని సూచించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top