అచ్చెన్నాయుడుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్సీ మహ్మద్‌ ఇక్బాల్‌

విజయవాడ: పోలీసులను దూషించిన టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ మహ్మద్‌ ఇక్బాల్‌ డిమాండ్‌ చేశారు. ఐపీఎస్‌ అధికారులను దూషించడం సబబు కాదన్నారు. ఎమ్మెల్సీ మహ్మద్‌ ఇక్బాల్‌ మీడియాతో మాట్లాడుతూ.. పోలీసు అధికారులను దూషించడం చూస్తే టీడీపీ నేతల మానసిక పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతుందన్నారు. గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో లా అండ్‌ ఆర్డర్‌ కుప్పకూలిందన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చంద్రబాబు అనవసరంగా హంగామా సృష్టిస్తున్నారన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రవర్తించాలన్నారు. 
 

Back to Top