అమరావతి: పోలవరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడే అర్హత, హక్కు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. మంగళవారం శాసన మండలిలో పోలవరంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ..సభలో సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా అధికార పార్టీ నేతలు గొప్పలు చెప్పుకోవడం సరికాదన్నారు. పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారా లేదా మాకు స్పష్టమైన సమాధానం ఇవ్వాలని ఆయన పట్టుబట్టారు. మీరు చెప్పే సమాధానాల్నే మేము ప్రశ్నిస్తున్నామని ధ్వజమెత్తారు. పోలవరం అంటే మొదట గుర్తుకు వచ్చేది దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డే అని స్పష్టం చేశారు. పోలవరం గురించి మాట్లాడాలంటే వైయస్ఆర్‌సీపీనే మాట్లాడాలని, మా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఎదురుదాడికి దిగడం ఎంతవరకు న్యాయమని నిలదీశారు దిగిన టిడిపి సభ్యులు పోలవరం పై మంత్రి నిమ్మలరామానాయుడు పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. చేనేత రంగాన్ని ఆదుకుంది వైయస్ జగనే.. వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వమే చేనేత రంగాన్ని ఆదుకుందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. చేనేత రంగానికి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో సమాధానం చెప్పాలని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు కోరితే.. సమాధానం దాటవేస్తూ మంత్రి సవిత విమర్శలు చేయడం భావ్యం కాదన్నారు. సభలో విపక్ష సభ్యులను మాట్లాడకుండా పదే పదే అడ్డుకోవడం సరికాదని హితవు పలికారు.