మత్స్యకారుల చిరకాల స్వపం సాకారం

ఇబ్రహీంపట్నంలో మత్స్య ఉత్పత్తుల విక్రయ దుకాణాల నిర్మాణాలకు శంకుస్థాపన 

భూమిపూజ‌ చేసిన శాసనసభ్యులు కృష్ణప్రసాదు 

ఎన్టీఆర్ జిల్లా: ఇబ్రహీంపట్నం ఫెర్రీలో మత్స్యకారుల చిరకాల స్వప్నం సాకారం కానుంది. వారి జీవనోపాధి పెంపొందించడానికి చర్యలు చేపట్టారు. గంగపుత్రుల దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించనుంది. మత్స్యకారుల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా గౌరవ ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫిష్ ఆంధ్ర పథకంలో భాగంగా మత్స్య ఉత్పత్తుల విక్రయ దుకాణాల నిర్మాణాలకు మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు గారు శుక్రవారం శంకుస్థాపన చేశారు. కృష్ణానదీ తీరాన ఆహ్లాదకరమైన వాతావరణంలో పలు దుకాణాల నిర్మాణాలకు శాసనసభ్యులు కృష్ణప్రసాదు  భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాదు మాట్లాడుతూ ..ఇక్కడ మత్స్యకారుల కోసం 45 దుకాణాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. సబ్సిడీతో పాటు, రుణ సదుపాయాలు కల్పించి, కొంత లబ్దిదారుని వాటాతో ఇక్కడ దుకాణాలు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. ఇంకా అర్హులైన వారు ఎవరైనా ఉంటే వారికి కూడా అర్హతలను బట్టి దుకాణాలను కేటాయిస్తామన్నారు. ఇక్కడ స్థలాన్ని కేటాయించేందుకు చొరవ చూపిన కలెక్టర్ గారికి, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. నదిపై, అందులో లభించే మత్స్య ఉత్పత్తులపై ఆధారపడి జీవించే గంగపుత్రులకు నదిఒడ్డున నిర్మిస్తున్న ఈ దుకాణ సముదాయం ఎంతో ప్రయోజనంగా వుంటుందన్నారు. రెండు మాసాల వ్యవధిలో ఈ దుకాణ నిర్మాణాలు పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. మత్స్యకారుల సంక్షేమం కోసం రాష్ట్రప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. సీఎం జ‌గ‌న్ మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Back to Top