కృష్ణాన‌ది క‌ర‌క‌ట్ట ప‌నుల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ శంకుస్థాప‌న‌

రూ.150 కోట్ల‌తో క‌ర‌క‌ట్ట ర‌హ‌దారి విస్త‌ర‌ణ ప‌నులు

విజ‌య‌వాడ‌: కృష్ణా నది కరకట్ట పనులకు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి  శంకుస్థాపన చేశారు. ప్రకాశం బ్యారేజీ వద్దనున్న కొండవీటి వరద ఎత్తిపోతల పథకం నుంచి రాయపూడి వరకు 15.5 కి.మీ. మేర కుడివైపు కరకట్ట విస్తరణ పనుల కోసం రాష్ట్ర‌ ప్రభుత్వం రూ. 150 కోట్లు ఖర్చు చేయనుంది. 10 మీటర్ల వెడల్పుతో రెండు వరుసల రహదారితో పాటు ఇరువైపులా రెండు వరుసల నడకదారులను నిర్మించనున్నారు. అమరావతి స్మార్ట్‌ అండ్‌ సస్టెయినబుల్‌ సిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ నిధులతో జలవనరుల శాఖ ఆధ్వర్యంలో విస్తరణ పనులు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయ‌ణ‌స్వామి, మంత్రులు బొత్స సత్యనారాయణ, మేక‌తోటి సుచ‌రిత‌, చెర‌కువాడ శ్రీ‌రంగనాధ రాజు, అనిల్ కుమార్‌ యాదవ్,  రాజ్య‌స‌భ స‌భ్యులు మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి, ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు. 

ఈ రహదారితో అమరావతిలోని ఎన్‌-1 నుంచి ఎన్‌-3 రోడ్లను అలాగే ఉండవల్లి- రాయపూడి- అమరావతి సీడ్‌ యాక్సిస్‌ రోడ్, గొల్లపూడి- చిన్నకాకాని- విజయవాడ బైపాస్‌ రోడ్లకు అనుసంధానమవుతుంది. కరకట్ట రహదారి నిర్మాణం ద్వారా అమరావతి, సచివాలయం, హైకోర్టు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్ధలు, తాడేపల్లి మండలంలోని ఉండవల్లి, పెనుమాక, తుళ్ళూరు మండలం వెంకటపాలెం, మందడం, ఉద్దండరాయునిపాలెం, రాయపూడి, బోరుపాలెం, అబ్బురాజుపాలెం, అమరావతి మండలం హరిశ్చంద్రాపురం, వైకుంఠపురం గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడునుంది. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top