చంద్రబాబు- పవన్‌ల కన్నా పెద్దసైకోలు ఎవరుంటారు..?

చంద్రబాబు- పవన్‌ల క‌న్న‌ పెద్దసైకోలు ..?

వైయ‌స్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ తెలుగు, సంస్కృతం అకాడమీ చైర్‌పర్సన్  నందమూరి లక్ష్మీపార్వతి 

బాబు చేతిలో పవన్‌ కీలుబొమ్మ

చంద్రబాబు ఒక స్మగ్లర్.. 2 ఎకరాల నుంచి రూ.6 లక్షల కోట్లకెలా ఎదిగాడు..?

బాబు రాజకీయ దిగ్గజం అయితే.. 23 సీట్లతో ఎందుకు ఓడిపోయాడు?

వైయ‌స్ జగన్‌ గారిని చూసి రాజకీయం నేర్చుకో పవన్ కల్యాణ్..

కుటుంబాలను చీల్చే నీచుడు చంద్రబాబు:  నందమూరి లక్ష్మీపార్వతి ఫైర్‌

విశాఖ‌:  చంద్ర‌బాబు, ప‌వ‌న్‌ల క‌న్నా పెద్ద సైకోలు ఎవ‌రుంటార‌ని  వైయ‌స్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ తెలుగు, సంస్కృతం అకాడమీ చైర్‌పర్సన్  నందమూరి లక్ష్మీపార్వతి  మండిపడ్డారు. సీఎం వైయ‌స్ జగన్‌ను విమర్శించే హక్కు పవన్‌కు లేదని, ప్రభుత్వ అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు కనిపించడం లేదా? అంటూ ఆమె ధ్వజమెత్తారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 

 నందమూరి లక్ష్మీపార్వతి మీడియాతో మాట్లాడుతూ..

పవన్ - బాబులకన్నా పెద్దసైకోలు ఎవరుంటారు..?ః
- ప్రజల్లో బలం లేని నేతలుగా చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు ఒంటరిగా మిగిలిపోయారు. ఎటూ పొత్తుల బేరంలో ఇరు పార్టీల కేడర్‌ల ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పుకోలేక.. మరోవైపు ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిన పరిస్థితుల్లో వారు తమ మానసిక స్థితిపై పట్టు కోల్పోయినట్లు నోరుపారేసుకుంటున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి గారిపై చేసిన వారి విమర్శలు, ఆరోపణలను నేను పూర్తిగా ఖండిస్తున్నాను. వట్టి గొడ్డుకు అరుపులెక్కువని తెలుగు సామెత చందంగా చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ ఇద్దరూ కలిసి .. ‘అది చేస్తాం.. ఇది చేస్తాం.. పాతాళానికి తొక్కేస్తాం.. నేలమీద కూర్చోబెడతాం..’ అంటూ వాగారు. పవన్‌కళ్యాణ్‌ మరీ అంత రెచ్చిపోయి మాట్లాడాల్సిన అవసరమేంటి..? అసలు, నువ్వు చదువుకున్నోడివేనా..? నీకు సంస్కారం ఉందా..? అదేమంటే.. కాపు సోదరులను పట్టుకుని మనం భోజనాలు పెట్టలేం.. మంచి నీళ్లు పోయలేం కనుక అన్నీఇన్నీ సీట్లు అడగ్గకూడదని చెబుతావా..? ఒక రాజకీయ పార్టీ అధినేతగా అలా మాట్లాడటానికి నీకు సిగ్గుందా..? పార్టీ కేడర్, నీ అభిమానుల ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేని నువ్వు .. అధికారంలో ఉన్న ప్రత్యర్థి పార్టీ అధినేతపై దుమ్మెత్తిపోస్తావా..? నీకున్న రాజకీయ అర్హత.. స్థాయేంటో తెలుసా నీకు..? .. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల కన్నా పెద్ద సైకోలు, ఉన్మాదులు  ఎవరైనా ఉంటారా..?

బాబు బ్లాక్‌మెయిలింగ్‌.. పవన్‌ కీలుబొమ్మః 
- మానసిక దౌర్భల్యంతో ఉన్నవారు ఎవరో ఒకరి చెప్పుచేతల్లో నడుస్తారంట. సరిగ్గా.. ఇదే పరిస్థితుల్లోనే చంద్రబాబు... పవన్‌కళ్యాణ్‌ను బ్లాక్‌మెయిలింగ్‌ చేసి తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. లేదంటే, అతని మానసిక పరిస్థితిని గమనించి, భారీగా ఆర్థిక ప్యాకేజీ అందించి చంద్రబాబు రాజకీయ వ్యూహం నడిపి కీలుబొమ్మగా ఆడిస్తున్నాడని అంటున్నారు. 

- పవన్‌కళ్యాణ్‌.. నీవు చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ కాకపోతే.. చంద్రబాబు నీ సమక్షంలోనే జనసేన జెండాల్ని మడిచి పక్కనబెట్టండని అరుస్తుంటే చూస్తూ ఉంటావా ..? నిజంగా, జనసేన పార్టీని బతికించుకోవడానికి ఆ పార్టీ కార్యకర్తలు చేస్తున్న పోరాటం కూడా పవన్‌కళ్యాణ్‌ చేయడంలేదు. చంద్రబాబు వేసే ముష్టికి  తలొంచలా..? పార్టీని తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెడుతున్నావు..? పార్టీ పరువును రోడ్డుకీడ్చి ప్రజల్లో ఎందుకు పలుచన చేస్తున్నావని.. ఆఖరికి నీ జనసేన కార్యకర్తలే ప్రశ్నిస్తుంటే.. వారిలో ఉన్న పౌరుషం కూడా నీలో కనిపించకపోవడం చాలా బాధాకరం. ఇలాంటి పరిస్థితికి దిగజారిపోయినందుకు నువ్వు  సిగ్గుపడాలి. 

చంద్రబాబు ఒక స్మగ్లర్ః
- చంద్రబాబులాంటి నీచుడు, వెధవ, హంతకుడు ఈ సమాజంలోనే ఇంకెవరూ ఉండరు. ఆయనొక స్మగ్లర్‌ కూడా.. వీటన్నింటికీ నేనే ప్రత్యక్షసాక్షిని. కేవలం 2 ఎకరాల పొలంతో మొదలుపెట్టి ఈరోజుకు రూ.6 లక్షల కోట్ల ఆస్తులకు ఎలా ఎగబాకాడో చంద్రబాబును ఏనాడైనా ప్రశ్నించావా..? ఆయన అవినీతి నీకు కనిపించడంలేదా..? ఆయన కొల్లగొట్టిన సొమ్ములో నీకెంత షేర్‌ చేస్తున్నాడో మాకు తెలియదు గానీ.. పబ్లిక్‌గా అతని మీదున్న కేసుల గురించి నువ్వు మాట్లాడకపోతే ఎలా..? సచ్ఛీలుడైతే అతని అవినీతిపై వేసిన 18 కేసుల్లో స్టేలు ఎందుకు తెచ్చుకున్నాడు..? అందులో నేను వేసిన కేసు కూడా ఉందికదా..? ఇన్ని అవినీతి కేసులున్నా.. నువ్వు మాత్రం నమ్మడం లేదంటే.. చంద్రబాబు చేతిలో నువ్వెంతగా బందీగా మారిందనేది స్పష్టంగా అర్ధమౌతూనే ఉంది. 

రాజకీయ దిగ్గజం అయితే.. 23 సీట్లతో ఎందుకు ఓడిపోయాడు?
- రాజకీయ దిగ్గజం, రాజకీయ పరిజ్ఞాని అని చంద్రబాబును పొగుడు తావా..? ఆయన గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు..? మరి, నువ్వన్నట్టు బాబు రాజకీయ పరిజ్ఞాని, దురంధరుడు అయితే.. జనాల గుండెల్లో ఉంటే.. 2019 ఎన్నికల్లో 23 సీట్లుతోనే ఎందుకు ఓడిపోయాడు..? 40 ఏళ్ల పొలిటికల్‌ ఇండస్ట్రీ అని చెప్పుకోవడం కాదు. 75 ఏళ్ల వయసున్న ఈ ముసలోడి చుట్టూ ఇప్పుడు 65 కేసులు చుట్టుముట్టి ఉన్నాయి. ప్రపంచమంతా చంద్రబాబు అవినీతి చక్రవర్తి అని చెబుతుంటే.. నీకు మాత్రం పక్కనే తిరుగుతున్నా ఆయన అవినీతి కనిపించడంలేదా..?

- గతంలో చంద్రబాబు అవినీతి గురించి నువ్వూ తిట్టిన చరిత్ర ఉందని మరిచిపోయావా..? నీ కుటుంబ పరువును బజారుకీడ్చి.. నీ తల్లిని.. అన్నను.. మీ కుటుంబ సభ్యుల్ని తెలుగుదేశం పార్టీ మనుషులే తీవ్రంగా అవమానించారని మీడియా ముందుకొచ్చి చెప్పావు కదా..? అలాంటి దుర్మార్గమైన చంద్రబాబు ఈరోజు గొప్ప రాజనీతిజ్ఞుడై పోయాడా..? సిగ్గుండాలి.

జగన్‌ గారిని చూసి రాజకీయం నేర్చుకో పవన్..ః
- పవన్ కూ.. చంద్రబాబుకు నడుమ స్నేహం ఎలా కుదిరిందో గానీ.. పవన్ మాత్రం జగన్‌గారిపై నిష్కారణంగా కోపం పెంచుకున్నాడు. లోకేష్, టీడీపీ నేతలు మాదిరిగా నీ తల్లిని జగన్ గారేమీ దూషించలేదే..? నీ కుటుంబ పరువును ఆయనేమీ బజారుకీడ్చలేదే..? నీ ఆవేశానికి అర్ధమేంటి..? మరి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేతగా జగన్‌మోహన్‌రెడ్డి గారికున్న పోరాట పటిమ నీలో ఇసుక రేణువంతైనా ఉందా..? ఆయన 2011లో పార్టీ పెట్టాడు. 2014 ఎన్నికలకు వెళ్లాల్సి ఉండగా.. ఆయన్ను 16 నెలలపాటు జైల్లో పెట్టారు. జైలు నుంచి బయటకొచ్చి కూడా ఒంటరిగా ధైర్యంగా శ్రమించలేదా..?. అప్పుడు కూడా రాష్ట్రంలోని 175 స్థానాల్లోనూ తన పార్టీ తరఫున అభ్యర్థుల్ని నిలబెట్టి గట్టి పోటీనిచ్చారు. నీకులా ఆయన ఎవరినీ పదో.. పరకో సీట్ల కోసం దేబిరించలేదే..? ఎవరి పొత్తుల కోసం ఆయన ఎదురు చూడలేదే..? ఎదిరించి నిలబడ్డాడు. కేవలం 1 శాతం ఓట్ల తేడాతో 67 మంది ఎమ్మెల్యేల్ని, 8 మంది ఎంపీల్ని గెలిపించుకున్నాడంటే.. అది ఒక నాయకుడి గట్స్‌ అంటే.. క్వాలిటీ రాజకీయమంటే.. జగన్‌ గారి రాజకీయ శైలిని చూసి నేర్చుకో పవన్‌కళ్యాణ్‌..

నీ బలహీనతల్ని కాపులపై రుద్దుతావా..?ః
- చంద్రబాబు సావాసం చేశాక.. నీ బలహీనతలను కాపు సామాజికవర్గం మీద రుద్దుతున్నావు. అదేమని ఎవరైనా ప్రశ్నిస్తే.. మనకు బలం లేనప్పుడు టీడీపీతో పోటీ ఎందుకంటావా..? అలా మాట్లాడటానికి కాస్త సిగ్గుతెచ్చుకో పవన్‌. ఎన్టీఆర్‌ గారు తెలుగుదేశం పార్టీని పెట్టి .. కేవలం 9 నెలల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. పరిపాలనా బాధ్యతల్లోనూ సమర్ధుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ మాత్రం రాజకీయ చరిత్ర నీకు తెలియకపోవడం నిజంగా నీ అమాకత్వమే.. నువ్వెంత బలహీనుడివో.. నీ మాటల్ని బట్టి కాపు సోదరులు అర్ధం చేసుకుంటున్నారు. 

- నీవు రాజకీయాల్లోకి ఎందుకొచ్చావో.. నీ పార్టీ లక్ష్యమేంటో ఎవరికీ అర్ధం కావట్లేదు. రాజకీయ రంగ ప్రవేశం చేశాక ఒక స్పిరిట్‌తో పనిచేసుకుపోవాలి గానీ.. నేను రాజకీయంగా ఎదుర్కోలేకపోతున్నా.. అందుకే, స్థాయి మరిచి రాష్ట్ర ముఖ్యమంత్రినే వ్యక్తిగతంగా దాడిచేస్తానంటే.. సభ్యసమాజం హర్షించదు. నీ పిచ్చి అరుపులకు, వెర్రి కేకలకు ఎలా బుద్ధిచెప్పాలో ప్రజలు నిర్ణయిస్తారు. 

ప్రజలు కష్టంలో ఉంటే మీరిద్దరూ హైదరాబాద్ లో ఉన్నారుః
- కాపు జాతి మేలు కోసం ఏ రోజైనా పనిచేశావా..? కరోనా లాంటి క్లిష్ట సమయంలోనూ .. కాపుసోదరుల కుటుంబాల్ని నువ్వేమైనా ఆదుకున్నావా..? అప్పట్లో సినిమాల ద్వారా రూ.కోటాను కోట్లు సంపాదించావు కదా..? మరి, ఒక్క రూపాయి అయినా నీ జేబులో నుంచి ఎందుకు ఖర్చుపెట్టలేకపోయావు..? పోనీ.. నీ బాస్‌ చంద్రబాబు 14 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రాన్ని లూఠీ చేశాడు కదా..? కరోనా కాలంలో ఇక్కడ ప్రజలకు ఆయనేం సేవలందించాడు..? ప్రజలు కష్టకాలంలో ఉన్నప్పుడు మీరిద్దరూ కలిసి హైదరాబాద్‌లో ఉన్నారే గానీ.. ఈ రాష్ట్రాన్నేమీ పట్టించుకోలేదు. ఈ విషయం ప్రజలు గమనించాలి. 

- పవన్‌కళ్యాణ్‌ అనే వ్యక్తి కాపుగా చెప్పుకుంటూ.. కాపుజాతినే అవమానిస్తున్నాడు. ఇది క్షమించరానటువంటి నేరం. కేవలం 24 సీట్లు తీసుకుని నీకు నువ్వు పెద్ద గొప్పగా భావిస్తూ.. నీ బలహీనతల్ని కాపు జాతిపై రుద్దుతూ చంద్రబాబు భిక్షతో మనం నిలబడ్డామని చెబుతావా..? అలా మాట్లాడటానికి నీకు సిగ్గనిపించడంలేదా..? 

కాపుజాతి ఏనాడో పవన్ ను బహిష్కరించిందిః
ఆత్మాభిమానం కలిగిన కాపుజాతి పవన్‌కళ్యాణ్‌ను ఎప్పుడో బహిష్కరించింది. నువ్వు నీ పార్టీని చంద్రబాబుకు తాకట్టు పెట్టినప్పుడే కాపు సోదరులకు నీ గురించి పూర్తిగా తెలిసిపోయింది. అందుకే, నీ సభలకూ జనస్పందన కరువైంది. జెండా సభ తాడేపల్లిగూడెంలోనే ఎందుకు పెట్టారంటే.. కాపు సామాజికవర్గ ప్రజలు అధికంగా ఉండే ప్రాంతం కనుక నీ జనం మొత్తం అక్కడకొస్తే.. ఆ జనసందోహాన్ని తన సభ గొప్పదనంగా ప్రచారం చేసుకోవాలనేది చంద్రబాబు ఎత్తుగడ. అయితే, అతని వ్యూహం బెడిసికొట్టింది. సినిమాల్లో నటించినంత తేలిగ్గా రాజకీయాల్లో నటిస్తే ప్రజలు నమ్ముతారనుకోవడం నీ అమాయకత్వమే పవన్‌.. ఇప్పటికైనా అసలు వాస్తవాల్ని గమనించి మసలుకో.. నా దృష్టిలో నువ్కొక రాజకీయ అజ్ఞానివి. నీలో ద్వేషం పెంచి జగన్‌గారిపై ఉసిగొల్పుతున్న అసలు దొంగ చంద్రబాబు. ఈ విషయం ఇప్పటికే ప్రజలు గుర్తించారు కనుక.. నిన్నెవరూ నమ్మడం లేదు. జగన్‌గారిపై పెద్ద ఎత్తున ఆదరణ చూపుతున్నారు. రేపటి ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అత్యధిక స్థానాల్ని గెలుచుకుని మళ్లీ సీఎంగా జగన్‌మోహన్‌రెడ్డి గారే ప్రమాణస్వీకారం చేస్తారు. 

కుటుంబాలను చీల్చే నీచుడు చంద్రబాబుః
- అధికారం కోసం కుటుంబాల మధ్య చిచ్చుపెట్టిన నీచుడు చంద్రబాబు. తండ్రీకొడుకుల మధ్య కొట్లాట పెట్టిన దుర్మార్గుడు. అలాగే, ఇప్పుడు జగన్‌ గారి కుటుంబంలోనూ అగ్గిరాజేశాడు. జగన్‌ గారికి వారి చెల్లెలుకు చంద్రబాబే తగువు పెట్టాడు. ఈరోజు ఢిల్లీలో వివేకానంద కూతురు సునీత ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ జగన్‌ గారిపై ఆరోపణలు చేసింది. అమ్మా, సునీతమ్మా.. మీరంతా చంద్రబాబు చంకనెక్కి తిరుగుతున్నారని.. నీ భర్త తెలుగుదేశంతో అంటకాగుతున్నాడని  ఆంధ్రరాష్ట్ర ప్రజలకు ఏనాడో తెలిసిపోయింది. కనుక, ఇప్పుడేదో మీరు కొత్తగా చెప్పి నమ్మించాలనుకున్నా ప్రజలు నమ్మరు గాక నమ్మరు. సొంత కుటుంబీకులు కూడా బయటకొచ్చి దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నారంటే.. వీటి వెనుక ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. వ్యవస్థల్ని మేనేజ్‌ చేయగలిగినోడు.. ఇలాంటి వెధవ పనులు చేయగలిగినోడు రాజకీయ చరిత్రలో ఒకే ఒక్కడున్నాడు.. అతడే చంద్రబాబు. ఇలాంటి దుష్టుడికి రేపటి ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధిచెప్పి రాజకీయాల నుంచి శాశ్వతంగా బహిష్కరించాలని కోరుతున్నాను. 

Back to Top