తండ్రీ కొడుకులు పాలు, కూరగాయలు అమ్ముకోవాల్సిందే 

ఏపీ తెలుగు అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీపార్వ

 
 తాడేపల్లి: మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు టీడీపీకి చెంప పెట్టు అని ఏపీ తెలుగు అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. తండ్రీ కొడుకులు పాలు, కూరగాయలు అమ్ముకోవాల్సిందేనని ఆమె ఎద్దేవా చేశారు.  ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబుకు తన కొడుకును వారసుడిగా చేయాలన్న ఆశయం పోయిందని, లాక్కున్న పార్టీని అడ్డం పెట్టుకుని కోట్లు సంపాదించుకున్నాడని మండిపడ్డారు. ఇప్పుడు టీడీపీ పార్టీని భూస్థాపితం చేశాడని, ఇక తండ్రీ కొడుకులు పాలు, కూరగాయలు అమ్ముకోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. తన భర్తకు చేసిన అవమానం ఇప్పుడు వాళ్లకు వచ్చిందని తెలిపారు.

సీఎం వైయ‌స్ జగన్ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించాడని లక్ష్మీపార్వతి తెలిపారు. నిజమైన ఎన్టీఆర్ అభిమానులైతే ఇకనైనా చంద్రబాబును వదిలేయండని చెప్పారు. టీడీపీ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించడం కష్టమని తెలిపారు. మరో 30 ఏళ్లు సీఎం జగన్ ప్రజలకు సేవ చేస్తారని తెలిపారు. తన భర్తను అవమానించిన పార్టీ ఉంటే ఏమిటి ఊడితే ఏమిటని ఆమె మండిపడ్డారు. చంద్రబాబు పని అయిపోయిందని, ఆత్మ విమర్శ చేసుకోవడానికి తన మైండ్ కూడా చెడిపోయిందని ధ్వజమెత్తారు. బాబు చేసిన పాపాలు తన కొడుకు రూపంలో శాపంగా మారాయని ఆమె తెలిపారు.  

Back to Top