తెలుగు-సంస్కృత అకాడమీ ఏర్పాటులో తప్పేంటి?

ఏపీ తెలుగు-సంస్కృత అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీపార్వతి 

అమరావతి: తెలుగు-సంస్కృత అకాడమీ ఏర్పాటులో తప్పేంటి? అని ఏపీ తెలుగు-సంస్కృత అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీపార్వతి  ప్రశ్నించారు. తెలుగు అకాడమీ పేరును తెలుగు-సంస్కృత అకాడమీగా మారుస్తూ  ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై వస్తున్న విమర్శలపై ఆదివారం ఏపీ తెలుగు-సంస్కృత అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీపార్వతి స్పందించారు. 

తెలుగు అకాడమీ పేరును తెలుగు-సంస్కృత అకాడమీగా.. విస్తరించడం వల్ల నష్టం ఏంటో విమర్శకులు వివరించాలి అని ఆమె నిలదీశారు. తెలుగు భాషాభివృద్ధికి, దానితో పాటు సంస్కృత భాషాభివృద్ధికి కూడా సీఎం జగన్ ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందించాలని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. అకారణమైన, నిర్హేతుకమైన విమర్శలను చేయవద్దని సవినియంగా మనవి చేస్తున్నానన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top