రైతుల‌కు ఎరువులు హోం డెలివ‌రీ

పీవోఎస్‌, ఎస్ఎంఎస్ స‌ర్వీసుల‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌తో క‌లిసి ప్రారంభించిన కేంద్ర మంత్రులు

సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను అభినందించిన కేంద్ర మంత్రి స‌దానంద‌గౌడు

తాడేప‌ల్లి:  రైతు భ‌రోసా కేంద్రాల ద్వారా రైతుల‌కు నేరుగా ఎరువులు హోం డెలివరీ చేసే కార్య‌క్ర‌మాన్ని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్రారంభించారు. బుధ‌వారం వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా  సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో క‌లిసి కేంద్ర మంత్రులు స‌దానంద‌గౌడు, మాండ‌వీయ ప్రారంభించారు. ఎస్ఎంఎస్‌ల ద్వారా రైతుల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు స‌మాచారం ఇచ్చే ప్ర‌క్రియ సీఎం, కేంద్ర మంత్రులు ప్రారంభించారు. ఎరువుల స‌ర‌ఫ‌రాపై పీవోఎస్‌, ఎస్ఎంఎస్ స‌ర్వీసుల‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో కేంద్ర మంత్రులు ప్రారంభించారు. ఎరువుల డోర్ డెలివ‌రీ విధానం ప్ర‌వేశ‌పెడుతున్నందుకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను కేంద్ర మంత్రి స‌దానంద‌గౌడు అభినందించారు. మిగ‌తా రాష్ట్రాలు కూడా ఈ విధానాన్ని అనుస‌రించి రైతుల‌కు తోడుగా ఉండాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top