విజయవాడ: బంధువుకు కాకపోయినా ఎన్టీఆర్‌ను సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి గౌరవించారని, కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం సంతోషంగా ఉందని వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, తెలుగు అకాడమీ చైర్‌పర్సన్, ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి కొత్త జిల్లాల ఏర్పాటు కార్యక్రమాన్ని వర్చువల్‌గా ప్రారంభించారు. కాగా, కొత్త జిల్లాల ఏర్పాటుపై తెలుగు అకాడమీ చైర్‌పర్సన్, ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి స్పందించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ఎన్టీఆర్‌కు నిజమైన వారసుడు జగన్‌మోహన్‌రెడ్డి. కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం సంతోషంగా ఉందన్నారు. ఇన్నాళ్లకు ఎన్టీఆర్ అభిమానుల కోరిక తీరిందన్నారు. టీడీపీ పార్టీని లాక్కుని ఎన్టీఆర్‌ను చంద్రబాబు మోసం చేశాడని విమర్శించారు. మొదటి నుంచి ఎన్టీఆర్ మీద చంద్రబాబుకు కక్ష.. వ్యతిరేక భావం. ఎన్టీఆర్ మంచివాడు కాదు అని బ్యాడ్ స్టేట్‌మెంట్స్ ఇచ్చాడు. భారతరత్న విషయంలో కూడా ఎన్టీఆర్‌కు చంద్రబాబు ద్రోహం చేశాడు. టీడీపీ దొంగల పార్టీగా తయారైందని అన్నారు.