పవన్‌ బీజేపీ-టీడీపీకి మధ్య బ్రోకర్‌

కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి

 కర్నూలు: పవన్‌ కల్యాణ్‌కు రాజకీయాలపై ఏమాత్రం అవగాహన లేదని, కేవలం బీజేపీ-టీడీపీకి మధ్య బ్రోకర్‌గా పని చేస్తున్నాడని కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మండిపడ్డారు. పవన్ కల్యాణ్‌ పార్టీకి అతీగతీ లేదని.. అసలు పోటీ చేసేందుకు గుర్తు కూడా లేదని ఎద్దేవా చేశారాయన. శుక్రవారం ఆయన కర్నూల్‌లో మీడియాతో మాట్లాడుతూ.. యువగళం పాదయాత్ర లో దిగజారుడు లోకేష్‌ దిగజారుడు రాజకీయాలు చేస్తూ.. విమర్శలు చేస్తున్నారన్నార‌ని ఎస్వీ మోహ‌న్ రెడ్డి ధ్వ‌జ‌మెత్తారు. నారా లోకేష్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. రాయలసీమ డిక్లరేషన్ పేరుతో మరోసారి చంద్రబాబు, నారా లోకేష్ సిద్దంగా వున్నారు. రాయలసీమ లో హైకోర్టు పెడుతామని చంద్రబాబు, నారా లోకేష్ చెప్పడం లేదు. ఫ్రస్టేషన్‌లో ఏం మాట్లాడుతున్నాడో చంద్రబాబు నాయుడుకి కూడా అర్థం కావడం లేదు. రైతులకు రుణ మాఫీ చెప్పి రాష్ట్రంలోని రైతులను చంద్రబాబు నాయుడు మోసం చేశాడు. మరో వైపు అక్కా చెల్లెళ్ళు రుణమాఫీ పేరుతో పసుపు కుంకుమ ఇచ్చి చేతులు దులుపుకున్నారు.

రాష్ట్రంలో అవినీతి ఆరోపణలు లేకుండా సీఎం వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పాలన అందిస్తున్నారు. కాబట్టి.. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌ అబద్ధాలను ప్రజలు నమ్మే పరిస్థితి‌‌ లేదు. ఇక బీజేపీకి ఏపీలో ఉనికే లేదు. తమకు ఉనికి ఉందంటూ చాటుకునే ప్రయత్నంలో భాగంగానే సీఎం వైయ‌స్‌ జగన్‌ను విమర్శిస్తున్నార‌ని మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

Back to Top