నకిలీ విత్తనాలు సరాఫరా చేస్తే కఠినచర్యలు

సహకార సొసైటీల ఆధునీకరణకు రూ.120 కోట్లు కేటాయింపు

వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు

అమరావతి:ఏపీ వ్యవసాయ శాఖ మంత్రిగా కురసాల కన్నబాబు బాధ్యతలు చేపట్టారు.రైతు భరోసా పథకం అమలుపై  తొలి సంతకం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  రైతులను ఆదుకునేందుకు రైతు బీమా పథకం అమలు చేస్తామని తెలిపారు.కౌలు రైతులకు ప్రత్యేక కార్డులను మంజూరు చేస్తామన్నారు.పంటల మీద హక్కులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు.కౌలు రైతులకు కూడా బీమా,రుణాలు,ఇతర రాయితీలు కల్పిస్తామన్నారు.రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

సహకార సొసైటీల ఆధునీకరణకు రూ.120 కోట్ల  కేటాయిస్తున్నట్లు వెల్లడించారు.నకిలీ విత్తనాలు చెలామణి అవుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని..నకిలీ విత్తనాలు సరఫరా చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.మిర్చి,పత్తి విత్తనాలు అధిక ధరల విక్రయాలన్ని అరికడతామని తెలిపారు.ఒక కంపెనీ కేజీ విత్తనాలను లక్షన్నరకు అమ్ముతోందని ఆ కంపెనీపై కఠినచర్యలు తీసుకుంటామని తెలిపారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top