వైయ‌స్‌ జగన్‌తో కేటీఆర్ బృందం భేటీ 

హైదరాబాద్‌ :   వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో  తెలంగాణ రాష్ట్ర స‌మితి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొద్ది సేప‌టి క్రిత‌మే భేటీ అయ్యారు. ఫెడరల్‌ ఫ్రంట్‌లో కలిసి వచ్చే విషయంపై వైయ‌స్ జ‌గ‌న్‌తో  చర్చలు జరపాలని ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ మేర‌కు కేటీఆర్‌తో పాటు ఎంపీ వినోద్‌ కుమార్‌, పార్టీ ప్రధాన కార్యదర్శులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, శ్రావణ్ కుమార్‌ రెడ్డిలు వైయ‌స్ జ‌గ‌న్ స్వ‌గృహానికి చేరుకున్నారు. కేటీఆర్‌ బృందానికి వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు సాద‌ర స్వాగ‌తం ప‌లికి చ‌ర్చ‌ల‌కు ఆహ్వానించారు.  

కాంగ్రెస్‌, బీజేపీలకు వ్యతిరేకంగా ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు కేసీఆర్‌ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఫ్రంట్‌ ఏర్పాటుపై ఇప్పటికే పశ్చిమ్‌బంగా సీఎం మమతా బెనర్జీ, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌యాదవ్‌, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో కేసీఆర్‌ చర్చలు జరిపారు.

Back to Top