అవ‌గాహ‌న క‌రువై అర్థర‌హిత‌ రాత‌లు

ఫోర్టిఫైడ్ బియ్యంపై ఎల్లోమీడియా త‌ప్పుడు ప్ర‌చారం

దుష్ప్ర‌చారాన్ని తిప్పికొట్టిన కృష్ణా జిల్లా జేసీ మాధ‌వీల‌త‌

ఫోర్టిఫైడ్ బియ్యం గురించి తెలియక ప్లాస్టిక్ బియ్యం కలిపి ఇస్తున్నారంటూ కొన్ని పత్రికలు వార్తలు ప్రచురించాయి. దీనిపై కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ డా.కె.మాధవీలత పాత్రికేయ సమావేశ ఏర్పాటు చేసి అపోహలను తొలగించారు. 

''ఫోర్టిఫైడ్ బియ్యం అంటే మైక్రో న్యూట్రియన్ట్స్ (సూక్మపోషకాలు) సమృద్ధిగా ఉన్న బియ్యం అని అర్థం. ఇందులో విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. 100 మామూలు బియ్యపు గింజలకు ఒక్క ఫోర్టిఫైడ్ బియ్యపు గింజ కలిపితే చాలు. ఈ బియ్యంలో ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి, విటమిన్ ఎ, జింక్, ఐరెన్, బి-12 మొదలైన పోషకాలెన్నో నిండి ఉంటాయి'' అని జాయింట్ కలెక్టర్ వివరించారు. 

మరింత సమాచారం :
పిల్లల్లో పౌష్టికత పెంచేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన పోషణ్ అభియాన్‌ లో భాగస్వాములయ్యేందుకు దేశంలో చాలా రాష్ట్రాలు ముందుకు రాలేదు. కానీ ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ వెంటనే స్పందించారు. నిజానికి ఫోర్టిఫైడ్ బియ్యం అందించేందుకు ప్రీమిక్స్‌ కోసం అయ్యే ఖర్చుతో పాటు GST 18%లో కేంద్రం ఏ మినహాయింపూ రాష్ట్రానికి ఇవ్వడంలేదు. దీనివల్ల కొన్ని వందల కోట్లు భారం పడుతున్నా ముఖ్య‌మంత్రి వైయస్ జగన్ ఇందుకు వెనుకాడలేదు. పిల్లల పౌష్టికాహారానికి లెక్కలు కట్టలేదు. పైలెట్ ప్రాజెక్టుగా ముందు పశ్చిమగోదావరిలో ప్రారంభించిన ఈ పథకం ఇప్పుడు అన్ని జిల్లాలకూ విస్తరించారు. 
మామూలు బియ్యంతో పాటు పౌష్టికతను పెంచే విటమిన్ బియ్యాన్ని కలిపి మరీ విద్యార్థుల మిడ్ డే మీల్ కు అందిస్తోంది వైయస్ జగన్ ప్రభుత్వం. 
ప్రతి బిడ్డనూ సొంత బిడ్డలా చూసుకుంటానని మాటిచ్చిన వైయస్ ఆ మాటను అక్షరాలా ఆచరణలో పెట్టి చూపుతున్నారు. విద్యార్థుల భోజనాన్ని మరింత పౌష్టికంగా మారుస్తూ  ఫోర్టిఫైడ్ బియ్యాన్ని మామూలు బియ్యంలో కలిపి అందిస్తున్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top