కృష్ణానది కబ్జా ప్రాంతాన్ని పరిశీలించిన వైయస్‌ఆర్‌సీపీ

ఇసుక,మట్టినే కాదు..నదులను సైతం వదలడం లేదు..

టీడీపీ నేతల కనుసన్నల్లో అధికారులు పనిచేస్తున్నారు

 

విజయవాడ: కృష్ణానదిని పూడ్చి.. కబ్జా చేసిన ప్రాంతాన్ని వైయస్‌ఆర్‌సీపీ నేతలు  లేళ్ల అప్పిరెడ్డి, గోపిరెడ్డి, నందిగం సురేష్, మేరుగ నాగార్జున తదితరులు పరిశీలించారు. కృష్ణానది గర్భంలో హాయ్‌ల్యాండ్‌ నిర్మాణం కోసం ఇప్పటికే చాలా భాగం పూడ్చివేశారని, నీటి ప్రవాహాన్ని మళ్లీంచేందుకు ఇసుక బస్తాలతో కరకట్ట కూడా వేశారని వైయస్‌ఆర్‌సీపీ నేతలు మండిపడ్డారు. అక్రమార్కులపై ఇప్పటి వరుకూ చర్యలు తీసుకోలేదని నిప్పులు చెరిగారు. సీఎం నివాసం పక్కనే ఇంత జరుగుతుంటే ఆయనకు తెలియదా అని ప్రశ్నించారు. ఇసుక,మట్టినే కాదు అధికార టీడీపీ నేతలు నదులను కూడా వదలడంలేదని ధ్వజమెత్తారు. టీడీపీ నేతల కనుసన్నల్లో అధికారులు పనిచేస్తూ వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు.

 

తాజా ఫోటోలు

Back to Top