పవన్‌ను ఎవరికైనా చూపించండిరా !

మంత్రి కొట్టు సత్యనారాయణ
 

పశ్చిమగోదావరి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నాడు. వారాహి యాత్ర పేరుతో పవన్‌ అవాకులు చెవాకులు పేలుతున్నాడు. పవన్‌ను ఎవరికైనా చూపించండిరా అని ప్రజలు అనుకుంటున్నారని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ అన్నారు. 
కొట్టు సత్యనారాయణ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. గుంట నక్క లాంటి చంద్రబాబుని ప్రజలు ఓడించాలనుకున్నారు. అతనితో ఉన్నవ్‌ కాబట్టే పవన్‌ నిన్ను కూడా ప్రజలు ఓడించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కష్టం చూసి ప్రజలు మెచ్చుకుని సీఎం పదవి ఇచ్చారు. కాపు సామాజిక వర్గాన్ని కించపరిచేలా పవన్‌ మాట్లాడుతున్నాడు. చంద్రబాబు కాపుల ఓట్ల కోసం పవన్‌ను వాడుకుంటున్నాడు. పవన్ కల్యాణ్‌ వెంట కాపులు రారు. పవన్‌.. 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తానని చెప్పే దమ్ముందా?. పవన్‌కు ప్రాణహాని అంటే అది చంద్రబాబు దగ్గర నుంచే ఉంటుంది. 

టీడీపీ హాయంలో కృష్ణా పుష్కరాల పేరిట 44 ఆలయాలను కూల్చేశారు. మా పాలనలో 250 ఆలయాలకు రూ.281 కోట్లు కేటాయించాం. చంద్రబాబును ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. పవన్‌.. జోకర్‌ లాంటి బాబు, లోఫర్‌ లాంటి లోకేశ్‌ మాటలు నమ్మకు అంటూ హితవు పలికారు. గత పారిపాలన చూసి చంద్రబాబు, పవన్‌ గానీ.. ఓట్లు వేయమని అడిగే దమ్ము, ధైర్యం సత్తా మీకు ఉందా?. సీఎం వైయ‌స్ జగన్‌ను తిడితే ఆయనను ఎన్నుకున్న ప్రజలను తిట్టినట్టే అవుతుంది.. ఇది తెలుసుకో పవన్‌ అంటూ కామెంట్స్‌ చేశారు. 
 

Back to Top