కోట్ల కుటుంబీకులు వైయస్‌ఆర్‌సీపీలో చేరిక

వైయస్‌ జగన్‌ సమక్షంలో పార్టీలో చేరిన కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి

వైయస్‌ఆర్‌ జిల్లా: కర్నూలు జిల్లాకు చెందిన మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి బంధువులు వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి సహ ఎంపీపీ, ఏడుగురు ఎంపీటీసీ సభ్యులు, పలువురు సర్పంచ్‌లు వైయస్‌ఆర్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. కోడుమూరు నియోజకవర్గ కాంగ్రెస్‌ నేత కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి వైయస్‌ జగన్‌ సమక్షంలో 2 వేల మందితో వైయస్‌ఆర్‌సీపీలో చేరారు.

వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. జగనన్నను ముఖ్యమంత్రి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు.
 

Back to Top