ఏపీలో కూడా టీడీపీ భూస్థాపితమే 

పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ కుప్పంలో బాబుకు చుక్కలు చూపించారు

అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కైవసం చేసుకుంటాం

  తాడేపల్లి: చ‌ంద్ర‌బాబు పిచ్చితో తెలంగాణాలో టీడీపీని భూస్థాపితం చేశాడు.. ఇప్పటికైనా ఆయన్ని  పిచ్చాసుపత్రిలో చేర్చాలని లేదంటే ఏపీలో కూడా ఆ పార్టీ భూస్థాపితమే అవుతుందని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. పంచాయతీ ఎన్నికల్లో 42 శాతం గెలుపు ఎక్కడ వచ్చిందో చంద్రబాబు చెప్పాలని నిల‌దీశారు. సోమవారం తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకి పిచ్చెక్కి మాట్లాడుతున్నాడని, గెలిచిన 42 శాతం ఎవరో ప్రకటించాలన్నారు.  ఆయన్ని టీడీపీ నేతలు ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రికి పంపడం ఖాయమని ఎద్దేవా చేశారు.  తమ నాయకుడు సీఎం వైయ‌స్‌ జగన్‌ చంద్రబాబుకి కుప్పంలో కూడా చుక్కలు చూపించాడని అన్నారు. కుప్పంలోనే తాము 75 స్థానాలు గెలిస్తే ఇక బాబు ఎక్కడ 42 శాతం వచ్చిందని నిలదీశారు. చంద్రబాబు పిచ్చి ప్రేలాపణలు మానుకోవాలని జూమ్‌యాప్‌‌లో కూర్చుని పగటి కలలు కంటున్నాడని దుయ్యబట్టారు. 

 గుర్తులేని పంచాయతీ ఎన్నికల్లోనే ప్రజలు సీఎం వైయ‌స్‌ జగన్‌కు బ్రహ్మరథం పట్టారని గుర్తుచేశారు. ఇక పార్టీగుర్తుతో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో విజయం తమదే అన్నారు. రాష్ట్రంలోని ఎన్నికలు జరిగే అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కైవసం చేసుకుంటామని కొడాలి నాని ధీమా వ్య‌క్తం చేశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top