ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఎన్టీఆర్‌ వర్ధంతి చేస్తారా?

వెయ్యిమంది బాలకృష్ణలు వచ్చినా జూ. ఎన్టీఆర్‌ను ఏం చేయలేరు 

మాజీ మంత్రి కొడాలి నాని

కృష్ణా జిల్లా:  ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఎన్టీఆర్‌ వర్ధంతి చేస్తారా? అని మాజీ మంత్రి కొడాలి నాని ప్ర‌శ్నించారు. లోకేష్‌ కోసం జూనియర్‌ ఎన్టీఆర్‌ను సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయ‌న మండిపడ్డారు. ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్లెక్సీలు తొలగింపుపై ఆయన స్పందిస్తూ.. జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్లెక్సీలు తొలగిస్తే ఏమైనా నష్టం  జరిగిందా?. వాళ్లది నీచాతినీచమైన బుద్ధి. వెయ్యిమంది బాలకృష్ణలు, చంద్రబాబులు వచ్చినా జూనియర్‌ ఎన్టీఆర్‌ను ఏం చేయలేర‌ని వ్యాఖ్యానించారు. బాల‌కృష్ణ ఆదేశాల‌తోనే జూనియ‌ర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల‌ను అభిమానులు తొల‌గించార‌న్నారు. ప్లెక్సీల‌ను తొల‌గిస్తే ఆయ‌న‌కు వ‌చ్చే న‌ష్టం ఏమీ లేద‌న్నారు. ఎన్టీఆర్ ఆశ‌యాల‌ను ముందుకు తీసుకెళ్తామ‌న్నారు. త‌ల‌కిందులుగా త‌పస్సు చేసినా చంద్ర‌బాబును ఎవ‌రూ ప‌ట్టించుకోర‌న్నారు. కొడుకును సీఎం చేయాల‌న్న‌దే చంద్ర‌బాబు ఆలోచ‌న అన్నారు.   జైల్‌కు రా..క‌దిలిరా అని కోర్టు చంద్ర‌బాబుకు చెప్పింద‌న్నారు.  

Back to Top