ఢిల్లీ వెళ్లి మోదీకి పెట్టు డెడ్‌లైన్‌లు

పవన్‌కు మంత్రి కొడాలి నాని సూచన  

విజ‌య‌వాడ‌: చనిపోయిన పార్టీ జనసేన తమకు డెడ్‌లైన్‌లు పెట్టడమేంటని మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. పవన్‌కల్యాణ్‌కు చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీకి డెడ్‌లైన్‌ పెట్టాలని సవాల్‌ విసిరారు.  కృష్ణా జిల్లా గుడివాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. పవన్‌ రెండు చోట్ల ఓడిపోయారని.. జనసేన డెడ్‌ పార్టీ అని అన్నారు.

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వారంలోగా ఆపకపోతే జానీ వంటి  సినిమాలను వాళ్లకు చూపించాలని ఎద్దేవా చేశారు. వాటిని చూసి ప్రధాని మోదీ భయపడతారేమో చూడాలన్నారు. రాష్ట్రంలో పవన్‌కల్యాణ్, చంద్రబాబుకు భయపడే వ్యక్తులెవరూ లేరన్నారు .

తాజా ఫోటోలు

Back to Top