కిల్లి కృపారాణి వైయస్‌ఆర్‌సీపీలో చేరిక

హైదరాబాద్‌:  కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకురాలు కిల్లి కృపారాణి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఇటీవల ఆమె కాంగ్రెస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి వైయస్‌ జగన్‌తో భేటీ అయిన విషయం విధితమే. కొద్ది సేపటి క్రితం వైయస్‌ జగన్‌ సమక్షంలో ఆమె పార్టీలో చేరారు. పార్టీలోకి వైయస్‌ జగన్‌ సాదరంగా ఆహ్వానించారు. వైయస్‌ జగన్‌తోనే రాజన్న రాజ్యం వస్తుందని కృపారాణి ఈ సందర్భంగా పేర్కొన్నారు.
 

Back to Top