పల్నాడు: కర్నూలు జిల్లాలో తెలుగుదేశం, బీజేపీలకు భారీ షాక్ తగిలింది. కూటమికి చెందిన కీలక నేతలు ముఖ్యమంత్రి వైయస్.జగన్ సమక్షంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పల్నాడు జిల్లా ధూళిపాళ్ల నైట్ స్టే పాయింట్ వద్ద ఆలూరు, కోడుమూరు నియోజకవర్గాలకు చెందిన తెలుగుదేశం, బీజేపీ కీలక నేతలు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైయస్ఆర్‌సీపీలో చేరారు. వారికి వైయస్ జగన్ కండువాలు వేసి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. కోడుమూరు నియోజకవర్గం టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్‌రెడ్డి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే కోడుమూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ కీలక నేత కోట్ల హరిచక్రపాణిరెడ్డి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆలూరు నియోజకవర్గం టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ మసాల పద్మజ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. భారతీయ జనతాపార్టీ నుంచి మాజీ మేయర్, ఆలూరు నియోజకవర్గ నేత కురువ శశికళ, ఆంధ్రప్రదేశ్ కురవ సంఘం గౌరవ అధ్యక్షుడు కృష్ణమోహన్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరారు. కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి, కోడుమూరు నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్, కర్నూలు ఎంపీ అభ్యర్థి బీవై రామయ్య, కుడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.