టీడీపీ తప్పుడు ఆరోపణలను తిప్పికొట్టాలి

 సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు
 

అమరావతి: టీడీపీ తప్పుడు ఆరోపణలను తిప్పికొట్టాలని సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మంత్రులకు సూచించారు. కేబినెట్‌ సమావేశం సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాల అబద్ధాలకు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇవ్వాలని ఆదేశించారు. ప్రతి అంశంపై మంత్రులు స్పందించాలన్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని చెప్పారు. కుటుంబ సభ్యులపైనా అనవసర విమర్శలు చేస్తున్నారని తెలిపారు. ఇకపై వాళ్ల ఆరోపణలను ఉపేక్షించడానికి వీల్లేదన్నారు.
 

తాజా వీడియోలు

Back to Top