కేబినెట్‌ భేటీలో సీఎం వైయస్‌ జగన్‌ కీలక వ్యాఖ్యలు

త్వరలోనే పార్టీ ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తా

సచివాలయం: మంత్రిమండలి సమావేశంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రెండేళ్లు ఎమ్మెల్యేలంతా క్షేత్రస్థాయిలో ఉండాలని, త్వరలోనే పార్టీ ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తానని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేశామని, ఎన్నికల ముందు చెప్పని వాగ్దానాలను కూడా నెరవేర్చామన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ పారదర్శకంగా అందిస్తున్నామని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమంపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరగాలన్నారు. ఈ అంశాల‌ను మంత్రుల‌తో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌స్తావించారు.

Back to Top