విజ‌య‌ద‌శ‌మి నుంచి విశాఖ నుంచే ప‌రిపాల‌న‌

కేబినెట్ భేటీలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు

తాడేపల్లి: కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పలు కీలక వ్యాఖ్య‌లు చేశారు.  విజయదశమి నుంచి విశాఖ నుంచే పరిపాలన ప్రారంభిస్తామని మంత్రిమండ‌లి స‌మావేశంలో వెల్ల‌డించారు. అప్ప‌టి వ‌ర‌కు కార్యాల‌యాల‌ను త‌ర‌లించాల‌ని నిర్ణ‌యించారు. విశాఖలో కార్యాలయాల ఎంపికపై కమిటీని నియమించాలని ఆదేశించారు. కమిటీ సూచనల మేరకు కార్యాలయాల ఏర్పాటు ఉంటుందన్నారు. ముంద‌స్తు, జ‌మిలి ఎన్నిక‌ల‌పై కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం మేర‌కు ముందుకెళ్తామ‌ని స్ప‌ష్టం చేశారు. కేబినెట్ సమావేశంలో పలు కీలక బిల్లుల‌ను ఆమోదించారు.

Back to Top