వైయస్‌ జగన్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్‌ భేటీ

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వైయస్‌ జగన్‌కు కేసీఆర్‌ ఆహ్వానం
 

అమరావతి: తెలంగాణ రాష్ట్రంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆహ్వానించేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు ఏపీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఈ నెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభిస్తున్నట్లు, ఈ కార్యక్రమానికి రావాలని కేసీఆర్‌ వైయస్‌ జగన్‌ను ఆహ్వానించారు. విభజన సమస్యలపై వైయస్‌ జగన్‌తో కేసీఆర్‌ చర్చించే అవకాశం ఉంది. వైయస్‌ జగన్‌ నివాసంలో కేసీఆర్‌ బృందం లంచ్‌ చేయనుంది. కేసీఆర్‌ వెంట కేటీఆర్, టీఆర్‌ఎస్‌ నేతలు ఉన్నారు
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top