ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేసిన రౌడీలు టీడీపీ, జనసేన, బీజేపీ వారే

కావలి వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి 

ఐ సపోర్ట్‌ బాబు..అంటూ బ్యానర్‌ పట్టుకుంది ఒకరు...

జనసేన జెండా కప్పుకుంది మరొకరు...

బీజేపీ నేత అనుచరుడిగా ఇంకొకరు...

మీడియాకు ఆధారాలతో సహా ఫోటోలు విడుదల చేసిన ఎమ్మెల్యే 

వాస్తవాలు తెలుసుకోకుండా లోకేశ్, పవన్ కల్యాణ్ లు  బుర్రలేని మాటలు

దొంగలే దొంగ దొంగ అంటూ మాపై దుష్ప్రచారం

ఇదే గ్యాంగ్ గతంలో నా కారుపై కూడా దాడి చేసింది

ఈ దాడిలో మా వాళ్లు ఒక్కరున్నా నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా

నాతో సహా ఎవరు తప్పు చేసినా వైయ‌స్ జగన్‌ గారు ఉపేక్షించరు: ఎమ్మెల్యే  ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి

తాడేప‌ల్లి:  కావ‌లిలో ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేసిన రౌడీలు టీడీపీ, జనసేన, బీజేపీ వారేన‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి స్ప‌ష్టం చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా లోకేష్‌ బుర్రలేని మాటలు మాట్లాడొద్ద‌ని హిత‌వు ప‌లికారు. కావలి పట్టణంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై కొందరు రౌడీలు ఘోరంగా దాడి చేశారు. ఆ రోజు సాయంత్రం 6.30 గంటలకు నేను, వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి ఆర్టీవో ఆఫీసు ఓపెన్‌ చేసి అదే రూట్లో తిరిగి వెళ్లామ‌న్నారు. అప్పడే ఆ సంఘటన జరిగినట్లుంది...మేం ఏం జరిగిందో చూడండి అని పోలీసులకు అక్కడ దించి వెళ్లామ‌న్నారు. దీనిపై బజ్జీల బుజ్జిబాబు లోకేశ్‌ మా పార్టీ వారంటూ ఆరోపణలు చేయగా, దత్తపుత్రుడు పవన్‌ కళ్యాణ్‌ ఒక లేఖను విడుదల చేశాడ‌ని త‌ప్పుప‌ట్టారు. వారిష్టానుసానుసారం మా పార్టీపై బురదజల్లేందుకు ప్రయత్నం చేశార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆ రౌడీ మూకలు ఎటువంటి అకృత్యాలు చేస్తారో కావలి నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసు అన్నారు. వారు చేసిన అఘాయిత్యాలను బయటపెట్టే సాహసం కూడా ప్రజలుచేయలేకపోతున్నారు.  అందుకే వాటిపై స్పందించరు..కేసులు పెట్టరు...ఈ విషయాన్ని గతంలో పోలీసులకు కూడా చెప్పాను. వారిని ఎదిరించినందుకే గతంలో నా కారుపై కూడా దాడి చేశార‌ని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఆ ముఠా చేసిన అఘాయిత్యాలు టీడీపీకి, జనసేనతో పాటు అందరికీ తెలుసు. టీడీపీ, దాని తోకపార్టీలు చిన్న విషయం జరిగినా వైయ‌స్ఆర్‌సీపీ కి అంటగట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఎవడో ఏదో చెప్పాడని ఈ బజ్జీల బుజ్జి లోకేశ్‌ స్టేట్‌మెట్లు ఇసున్నాడు. బాబూ లోకేశ్...కావలిలో డ్రైవర్‌ కొట్టిందెవరో కావలి ప్రజలందరికీ తెలుసు. నీకు బుర్రలేదు కాబట్టి ఏదంటే అది మాట్లాడుతున్నావు..వాస్తవాలు తెలుసుకో అంటూ హిత‌వు ప‌లికారు.

వారంతా టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్లే:
సుధీర్‌ అనే వ్యక్తి ప్రధాన ముద్దాయి..అతనే గతంలో నా కారుపై కూడా దాడి చేశాడు. 
టీడీపీ టిక్కెట్‌ కోసం ప్రయత్నం చేస్తున్న పసుపులేటి సుధాకర్‌ అనే వ్యక్తి పక్కన నిందితుడు గుర్రంకొండ అరుణ్‌ కుమార్‌ ఉన్నాడు. 
సుధాకర్‌ అనే వ్యక్తి గతంలో జనసేన తరఫున నాపైనే పోటీ చేశాడు. అతని వద్ద ఇలాంటి గ్యాంగులు చాలా ఉన్నాయి. వారిని హైదరాబాద్‌లో పెట్టి ఏం చేస్తున్నాడో అందరికీ తెలుసు. 
అదే అరుణ్‌ కుమార్‌ అనే వ్యక్తి ఏ పార్టీ సపోర్టర్‌ అనేది చూసుకో పప్పు లోకేశ్‌. 
ఐ సపోర్ట్‌ బాబు అంటూ నిందితుడు బ్యానర్‌పట్టుకున్నాడు చూడు. 
వాళ్లు మద్దతు ఇస్తున్నది నీ తండ్రికే కానీ...వాళ్లు వైయ‌స్ఆర్‌సీపీ వాళ్లు కాదు...
పవన్‌ కళ్యాణ్‌ నువ్వు కూడా చూసుకో...శివారెడ్డి అనే వాడు నీ పార్టీ కార్యకర్తే. 
ఎవరు ఎలాంటి వారో...ఎవరు రౌడీషీటర్లను పక్కన పెట్టుకుని తిరుగుతున్నారో గుర్తుపెట్టుకో. 
ప్రజలంతా ఇవన్నీ గుర్తించాలి. కావాలని వైయ‌స్ఆర్‌సీపీపై బురదజల్లేందుకు వారు చేసే ప్రయత్నాలు గమనించాలి. 
దొంగలే దొంగ దొంగ అంటూ మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు.

ఆర్టీసీ కార్మికులను ఆక్కున చేర్చుకున్నది మా ప్రభుత్వం:
ఆర్టీసీ కార్మికులకు ఎవరైనా మంచి చేశారంటే..అది ఒక్క వైయ‌స్ జగన్‌ మోహన్‌ రెడ్డి గారే చేశారు. 
కార్పొరేషన్‌ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసిన నాయకుడు జగన్‌గారు. 
నిందితులంతా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలకు అనుచరులే. 
వీళ్లంతా కలిసి ఏదో ఒక విధంగా వైయ‌స్ఆర్‌సీపీపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. 
భువనేశ్వరి గారు నిజం గెలవాలి అంటుంటే లోకేశ్‌ మాత్రం నిజాలను దాచే ప్రయత్నం చేస్తున్నాడు. 
నిజాల్ని దాచి వాటిని మామీద రుద్దాలంటే కుదరదు. 
గుర్రంకొండ సుధీర్‌పై నాలుగు రాష్ట్రాల్లో వందల కేసులున్నాయి. 
వీళ్లమీద ఎన్నెన్ని కేసులున్నాయో వాటన్నిటినీ బయటకు తీస్తాం. 
వీళ్లే కాదు ఇంకా రెండు మూడు గ్యాంగులున్నాయి..వీళ్లంతా ఒక గ్రూపు. 
కావలి ప్రజలు ప్రశాంతంగా ఉండటమే నా లక్ష్యం..నేను దేనికీ భయపడే వాడిని కాదు. 
డ్రైవర్‌పై జరిగిన అఘాయిత్యం మొత్తం ఈ ముఠా పనే. 
కావలిలో ఎవరన్నా మాట్లాడితే వారిని కొట్టడం, కొంత మంది పోలీసుల చనువుతో వీళ్ల ఆగడాలు సాగుతున్నాయి. 

ఆ గ్యాంగులో మా పార్టీ వాడు ఒకడున్నా నేను రాజీనామా చేస్తా:
ఈ గ్యాంగుల్లో నావైపు నుంచి ఒకడున్నా కూడా నేను నా పదవికి రాజీనామా చేస్తాను. 
ఆరోపించిన లోకేశ్‌ రాజీనామా చేస్తాడా..? అతని దగ్గర రాజీనామా చేయడానికి కూడా ఏమీ లేదులే. 
సున్నా సున్నా కలిస్తే పెద్ద సున్నా తప్ప ఏమీ లేదులే నీదగ్గర. నీ బాబు నీకేదో జాతీయ హోదా ఒకటి ఇచ్చాడు..దానికి తగ్గట్లుగా మాట్లాడితే కొంచెమన్నా బాగుంటుంది. 
టీడీపీ హయాంలో వనజాక్షిని కొట్టిన దానికంటే ఘోరాలు మా ప్రభుత్వంలో ఏం జరిగాయి? 
ఆనాడు మీరు చింతమనేనికి మద్దతు పలికారు. జగనన్న ప్రభుత్వంతో నేనైనా సరే తప్పు చేస్తే మా నాయకుడు సహించడు. 
మీ తండ్రి వ్యవస్థలను ఎలా మేనేజ్‌ చేశాడో, స్టేలు తెచ్చుకుని ఎలా బతికాడో దేశమంతా తెలుసు. 
నీ బాబు అనేక వందల స్కాంలు చేస్తే..నువ్వొచ్చి అంతకు మించి చేశావు. 
టీడీపీ నేతలకు చెప్తున్నా...రాజకీయం చేయండి..తప్పులేదు..
లేనిపోని అబద్ధాలు చెప్తే ప్రజల్లో ఇంకా చులకనైపోతారు..మంచిని మంచి అని చెప్పండి..చెడును చెడుగా చెప్పండి. 
మీరు తప్పు చేసి మాపై వేస్తే ప్రజలు అమాయకులు కాదు...
మీరు చేసిన అఘాయిత్యాలకే ప్రజలు మీకు మంచి సర్టిఫికెట్‌ ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు. 
లోకేశ్‌...ఏదైనా ఉంటే...ప్రిపేర్‌ అయ్యి నిజమా కాదా తెలుసుకుని మాట్లాడాలి. 
కావలి నియోజకవర్గంలో రౌడీయిజాన్ని సహించేది లేదు. 
ఎవరైనా ఇలాంటి వారు నావైపు ఉన్నారని మీరు ప్రూవ్‌ చేస్తే నేను రాజకీయాల్లోంచి తప్పుకుంటా. 

Back to Top