వైయస్‌ఆర్‌సీపీలోకి కొత్తప‌ల్లి సుబ్బారాయుడు

చంద్రబాబు నమ్మించి మోసం చేశారు

టీడీపీకి కొత్తపల్లి సుబ్బారాయుడు రాజీనామా

వైయస్‌ జగన్‌ సీఎం కావడం ఖాయం

మాట తప్పని మడమ తిప్పని నేత వైయస్‌ జగన్‌

పశ్చిమగోదావరి: వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలోకి చేరబోతున్నట్లు కొత్తప‌ల్లి సుబ్బారాయుడు తెలిపారు. నరసాపురంలో కార్యకర్తలతో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు సమావేశం ఏర్పాటు చేశారు. కార్యకర్తల సమక్షంలో టీడీపీకి ఆయన రాజీనామా చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  చంద్రబాబు నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. నన్ను సంప్రదించకుండా మరొకరికి టికెట్‌ కేటాయించడం బాధాకరమన్నారు.నాకు నరసాపురం టికెట్‌ ఇవ్వకపోయిన బాధలేదు కానీ నమ్మకద్రోహం చేయడంపై నా ప్రజలు బాధపడుతున్నారన్నారు. నాతో పాటు 10 మంది కౌన్సిలర్లు సహా వేలాది మంది కార్యకర్తలు టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. మాట తప్పని మడమ తిప్పని నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.నరసాపురంలో ముదునూరి ప్రసాదరాజును అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని తెలిపారు. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలో వైయస్‌ఆర్‌సీపీ అత్యధిక సీట్లు గెలిచేందుకు ప్రచారం చేస్తానని తెలిపారు.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top