కుట్రలకు కేరాఫ్‌ అడ్రాస్‌ చంద్రబాబు

అక్రమాలకు అడ్డా చంద్రబాబు కార్యాలయం

చంద్రబాబు కార్యకర్తలా మాట్లాడుతున్నారు

బెంగుళూరు నుంచి కరకట్టకు డబ్బు తరలిస్తున్నారు

చంద్రబాబు అవినీతి,కుట్రలపై ఏపీ హిస్టరీలో ఛాప్టర్‌ పెట్టాలి

దళితుల పట్ల  చంద్రబాబుకు ప్రేమలేదు

వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత సి.రామచంద్రయ్య

విజయవాడ:చంద్రబాబు కార్యాలయమే కుట్రలకు కేంద్రంగా మారిందని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత సి.రామచంద్రయ్య మండిపడ్డారు.విజయవాడ వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.వెంకటేశ్వరరావును విధుల నుంచి తప్పించినా అనధికారంగా పనిచేస్తున్నారన్నారు.చంద్రబాబు అక్రమ కట్టడంలో  ఉంటూ చట్టాలను,విలువలను ఉల్లంఘిస్తున్నారన్నారు.చంద్రబాబు కార్యాలయంగా అక్రమాలకు అడ్డంగా మారింది. అక్కడ నుంచే దందాలు చేస్తున్నారు.చంద్రబాబు కరకట్ట కుట్రదారుడు అని తెలిపారు.కరకట్ట కేంద్రంగా పెద్దఎత్తున ఎన్నికలకు వేల కోట్ల రూపాయలు డబ్బులు హెలికాఫ్టర్‌ల్లో  తరలిస్తున్నారు.బెంగుళూరు నుంచి కరకట్టకు తరలివస్తున్నట్లు సమాచారం.ఈ డబ్బులు తరలించడంతో వెంకటేశ్వరరావు కీలక పాత్ర వహిస్తున్నారు.ఇందులో భాగంగా ఏప్రిల్‌ 2న  చంద్రబాబును వెంకటేశ్వరరావు రహస్యంగా కలిసినట్లు సమాచారం ఉంది.లోటస్‌ పాండ్‌లో కుట్రలంటూ చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.కుట్రలకు కేరాఫ్‌ అడ్రాస్‌ చంద్రబాబు అని అభివర్ణించారు.

వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వరుసగా ఎన్నికల సభల్లో పాల్గొని ఒక రోజు విరామం ప్రకటించి పార్టీ పనులపై దృష్టిపెడితే చంద్రబాబు పెడ అర్థాలు తీసి నానాయాగీ చేస్తున్నారన్నారు.చంద్రబాబు చుట్టు ఉన్నవారిపై అరెస్ట్‌ వారెంట్లు ఉన్నాయన్నారు.కుట్రకు పర్యాయపదం,వెనుపోటుకు మరో రూపం చంద్రబాబు నాయుడు.మూడు రోజుల క్రితం మీ సుపుత్రుడు మంగళగిరిలో ప్రచారం చేస్తూ విశాఖపట్నం వెళ్ళి అక్కడ పారిశ్రామికవేత్తలతో సమావేశం పెట్టారన్నారు.వారి నుంచి డబ్బులు తీసుకొచ్చి మంగళగిరిలో పెట్టాలన్నా అని ప్రశ్నించారు.నోటికి వచ్చినట్లు చంద్రబాబు కార్యకర్తలా మాట్లాడుతున్నారు.కోడికత్తి పార్టీ అంటూ వైయస్‌ఆర్‌సీపీని ప్రతిసారి ఎగతాళి చేసి చంద్రబాబు మాట్లాడుతున్నారని, మీది వెనుపోటు పార్టీనా అని ప్రశ్నించారు.

చంద్రబాబు చేసిన అవినీతి, కుట్రలు,కుయుక్తులపై ఏపీ హిస్టరీలో ఒక ఛాప్టర్‌ పెట్టాలన్నారు.వైయస్‌ఆర్‌సీపీని అపహాస్యం  చేస్తుంటావు..కాని మా పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి..వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇవ్వలేదా అని ప్రశ్నించారు.టీడీపీని ఓడించేందుకు అద్దె  నటులను తీసుకువస్తున్నారని విమర్శలు చేస్తున్నారని,తెలుగుదేశం పార్టీనే ఒక సినీనటుడు స్థాపించారన్నారు.రాజకీయంలోకి చిల్లరగా కాదు..టోకుగా తీసుకొచ్చి ప్రచారం చేయించుకుంది తెలుగుదేశం పార్టీ కాదా..అని ప్రశ్నించారు.మురళీమోహన్,రాఘవేంద్రరావు,అశ్వనిదత్,శారద,జయప్రద,రామనాయుడు,ఏవీఎస్‌..ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా చాలా ఉంది.అమరావతిని జగన్‌  మార్చేస్తారని చంద్రబాబు దుష్ఫ్రచారం చేస్తున్నారన్నారు.వైయస్‌ జగన్‌ను చూసి చంద్రబాబు భయపడితున్నారన్నారు.చంద్రబాబు పచ్చపత్రిక ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఫేక్‌ సర్వేతో  విశ్వసనీయత ఏమిటో ప్రజలకు అర్థమవుతుందన్నారు.ఎన్ని కుట్రలు పన్నిన వైయస్‌ జగనే గెలుస్తారన్నారు.బలహీనవర్గాలను దెబ్బతీసింది చంద్రబాబే అని అన్నారు.దళితులపై చంద్రబాబుకు ప్రేమలేదని,మాదిగలు,మాలలను తిట్టిందే చంద్రబాబు అని అన్నారు.ఎస్సీ కులంలో చిచ్చు పెట్టింది చంద్రబాబే అని అన్నారు.ఎస్సీవర్గీకరణ చేయకుండా చంద్రబాబు ఐదేళ్లు గడిపారన్నారు.

 

Back to Top