సీఎం వైయస్‌ జగన్‌ చరిత్రలో నిలిచిపోతారు

కాపులందరి తరఫున సీఎంకు హృదయపూర్వక కృతజ్ఞతలు

కాపు కార్పొరేషన్‌ చైర్మన్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా

తాడేపల్లి: అన్ని వ‌ర్గాల సంక్షేమం కోసం అహ‌ర్నిశ‌లు కృషి చేస్తున్న‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చరిత్రలో నిలిచిపోతారని కాపు కార్పొరేషన్‌ చైర్మన్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. వైయస్‌ఆర్‌ కాపు నేస్తం పథకం ప్రారంభించి  అక్కచెల్లెమ్మలకు ఆర్థికసాయం చేసిన సీఎంకు కాపులందరి తరఫున కృతజ్ఞతలు తెలిపారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమ్మ ఒడి, రైతు భరోసా, జగనన్న విద్యా వసతి, వసతి దీవెన పథకాల ద్వారా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ లక్షలాది మంది కాపులకు మేలు చేశారన్నారు. 13 నెలల కాలంలో కాపు సామాజికవర్గానికి సీఎం వైయస్‌ జగన్‌ రూ.4,770 కోట్లు ఖర్చు చేశారని గుర్తుచేశారు. దీని ద్వారా 22.89 లక్షల మంది కాపులకు మేలు జరిగిందన్నారు. 

సీఎం వైయస్‌ జగన్‌ అండగా నిలిచారు
వైయస్‌ఆర్‌ కాపు నేస్తం పథకాన్ని ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా 2.36 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.15 వేల చొప్పున సీఎం వైయస్‌ జగన్‌ సాయం అందించారన్నారు. ఇందుకోసం రూ.354 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసిందని చెప్పారు. కాపులకు అండగా సీఎం వైయస్‌ జగన్‌ నిలిచారన్నారు. 

కాపులకు చంద్రబాబు చేసిందేమీ లేదు
వంగవీటి రంగాను చంపించిన దగ్గర నుంచి చూస్తే కాపులకు చంద్రబాబు చేసిందేమీ లేదని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. గత ప్రభుత్వ పాలనలో కాపులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, కాపులను బీసీల్లో చేర్చుతానని చంద్రబాబు మోసం చేశాడన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని అడిగిన వారిపై చంద్రబాబు తప్పుడు కేసులు పెట్టించి చిత్రహింసలకు గురిచేశాడని మండిపడ్డారు. కాపులను తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు మాత్రమే వాడుకుందన్నారు. 

 

Back to Top