క‌ప్ప‌ట్రాళ్ల బొజ్జ‌మ్మ వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌

తాడేప‌ల్లి: సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ సమక్షంలో  కర్నూలు జిల్లా టీడీపీ మాజీ జెడ్పీటీసీ కప్పట్రాళ్ళ బొజ్జమ్మ (సుశీలమ్మ) వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. బొజ్జమ్మతో పాటు ఆమె భర్త డి. రామచంద్ర నాయుడు (దేవనకొండ మాజీ ఎంపీపీ), ప‌లువురు టీడీపీ నేత‌లు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్య‌క్ర‌మంలో కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి, కడప జెడ్పీ చైర్మన్‌ ఆకేపాటి అమర్‌నాథ్‌ రెడ్డి పాల్గొన్నారు.
 

Back to Top