కల్‌గుడి యాప్‌ను ఆవిష్కరించిన మంత్రి కన్నబాబు

రైతులు పండించిన పండ్లు, కూరగాయలు విక్రయించేందుకు కల్‌ గుడి యాప్‌

విజయవాడ: రైతులు పండించిన పండ్లు, కూరగాయలు విక్రయించేందుకు వీలుగా రూపొందించిన ఆన్‌లైన్‌ యాప్‌ను వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ఆవిష్కరించారు. బుధవారం విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి చేతుల మీదుగా యాప్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ..ఆంధ్ర గ్రీన్స్‌ ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌ ద్వారా రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసిన వినియోగదారులకు పండ్లు, కూరగాయలు అందజేస్తామన్నారు. దళారీ వ్యవస్థను రూపుమాపేందుకు ఆంధ్ర గ్రీన్స్‌ ఆన్‌లైన్‌ వ్యవస్థ ఉపయోగపడుతుందన్నారు. ఇప్పటికే స్విగ్గీ, జుమాట ద్వారా పండ్లు, కూరగాయలు విక్రయిస్తున్నామన్నారు. 8 లక్షల 11 వేల ఫ్రూట్స్‌ కిట్స్‌ను ఇంటి ఇంటికి పంపిణీ చేస్తున్నామన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పంటల ధరలు పడిపోకుండా కొనుగోలు చేస్తున్నామన్నారు. ధరలు పడిపోకుండా ప్రభుత్వమే భారం భరించి రైతులను ఆదుకుంటుందన్నారు. ధరల స్థిరీకరణ నిధి నుంచి వెయ్యి కోట్లు ఖర్చు చేసి రైతులను ఆదుకున్నామని చెప్పారు. ధాన్యం కొనుగోలుకు రూ.4 వేల కోట్లు ఖర్చు చేశామని మంత్రి కన్నబాబు వివరించారు.

Back to Top