కాళేశ్వరం శిలా ఫలకాన్ని ఆవిష్కరించిన సీఎం వైయస్‌ జగన్‌

హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో   గవర్నర్‌ నరసింహన్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌ తో బాటు ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు ప్రాజెక్ట్‌  శిలా ఫలకాన్ని వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు.జల సంకల్ప యాగం అనంతరం ముగ్గురు సీఎంలు, గవర్నర్‌ మేడిగడ్డ బ్యారేజీ వద్దకు వెళ్లారు. ప్రాజెక్టు ఏరకంగా రూపుదిద్దుకుంది, దానికి ఏరకంగా స్వదేశి టెక్నాలజీని ఉపయోగించుకున్నారు తదితర విషయాలు ఏపీ, మహారాష్ట్ర సీఎంలకు వివరించారు. ఓ ఇంజనీర్‌ మ్యాప్‌ ద్వారా పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇస్తూ వారికి కాళేశ్వరం ప్రాజెక్టు విషయాలు వివరించారు. అనంతరం ముగ్గురు ముఖ్యమంత్రులు, గవర్నర్‌ నరసింహన్‌ మేడిగడ్డ ప్రాజెక్టు వద్దకు చేరుకొని శిలాపలకాన్ని ఆవిష్కరించారు..

 

 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top