టీడీపీ వ‌ద్ద ఎప్పుడూ మూడు స్క్రిప్ట్‌లు ఉంటాయి

నారా లోకేష్‌కు ఎమ్మెల్యే కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి స‌వాల్‌

నెల్లూరు:  టీడీపీ వద్ద ఎప్పుడూ మూడు స్క్రిప్ట్‌లు రెడీగా ఉంటాయని, పరిస్థితిని బట్టి వాటిని ప్రజలపై రుద్దడం వాళ్లకి అలవాటుగా మారిందని వైయ‌స్సార్‌సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో మత్స్యకారులకు రూ.43 కోట్ల ప్యాకేజీ ఇచ్చామని లోకేష్ చెప్పారు. అదంతా నిజం కాదు.. ఒక వేళ ఈ విషయాన్ని నిరూపిస్తే 24 గంటల్లో రాజీనామా చేస్తానని కాకాణి.. లోకేష్‌కు సవాల్‌ విసిరారు. తిరుపతి ఉప ఎన్నికలో ఓటింగ్‌ శాతం పడిపోవడానికి టీడీపీ నేతలే కారణమని ఆయ‌న మండిపడ్డారు. క్యూలో ఓటర్లను కూడా టీడీపీ నేతలు భయబ్రాంతులకు గురిచేశారని అన్నారు. దొంగ ఓట్లంటూ టీడీపీ, బీజేపీ అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారు.  

Back to Top