క్రీడల‌తో మానసిక ఉల్లాసం

  క‌దిరి ఎమ్మెల్యే డాక్ట‌ర్ సిద్ధారెడ్డి

అనంత‌పురం:  క్రీడ‌ల‌తో మానసిక ఉల్లాసం క‌లుగుతుంద‌ని క‌దిరి ఎమ్మెల్యే డాక్ట‌ర్ సిద్ధారెడ్డి అన్నారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్ర పోటీల్లో తనకల్లు మండల స్థాయి ఎంపికలో విజయం సాధించిన జట్టుకు కదిరి శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి  కప్పును, సర్టిఫికెట్లను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి  వైయ‌స్ జ‌గ‌న్ ప్రభుత్వంలో గ్రామీణ స్థాయి నుంచి క్రీడలను ప్రోత్సహిస్తూ ఆసక్తిగల ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించారన్నారు.  క్రీడలు అన్నవి మానసిక ఉల్లాసాన్నిస్తాయని, శారీరక రుగ్మతను తొలగిస్తాయని ఈ సందర్భంగా తెలిపారు.  నైపుణ్యం గల ప్రతి క్రీడాకారుడు కూడా మంచి స్థాయికి ఎదిగేందుకు ఇది ఒక వేదికగా ఆడుదాం..ఆంధ్రా కార్య‌క్ర‌మం ఉపయోగపడుతుందన్నారు. క్రీడాకారులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని పై స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.   

తాజా వీడియోలు

Back to Top