సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌తో నీల్ ర‌హేజా భేటీ

విశాఖ‌లో ఇనార్బిట్ మాల్ శంకుస్థాప‌న‌కు సీఎంకు ఆహ్వానం

తాడేప‌ల్లి: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డితో కె రహేజా గ్రూపు ప్రెసిడెంట్‌ నీల్‌ రహేజా, ఇనార్బిట్‌ మాల్స్‌ సీఈఓ రజనీష్‌ మహాజన్, కె రహేజా గ్రూప్‌ ఆంధ్రా, తెలంగాణా చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ గోనె శ్రావణ్‌ కుమార్ భేటీ అయ్యారు. విశాఖపట్నంలో ఇనార్బిట్‌ మాల్‌ నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను కె రహేజా గ్రూపు ప్రతినిధులు ఆహ్వానించారు. విశాఖలో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇనార్బిట్‌ మాల్‌ నిర్మాణం జ‌ర‌గ‌నుంది. కె రహేజా గ్రూప్ మూడేళ్లలో రూ.600 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌లో మరిన్ని పెట్టుబడులపై ముఖ్యమంత్రితో కె రహేజా గ్రూపు ప్రతినిధులు చర్చించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఏపీఐఐసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌లు పాల్గొన్నారు.

Back to Top