సినీ క‌ళాకారులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌

 హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తుండటంతో వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. జననేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నాయకత్వంలోని  వైయ‌స్ఆర్‌సీపీలో చేరేందుకు అన్ని వర్గాల వారు ముందుకు వస్తున్నారు. తాజాగా సినీ రంగానికి చెందిన పలువురు వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. హాస్య నటుడు జోగినాయుడు సహా పలువురు సినీ కళాకారులు శుక్రవారం వైయ‌స్ఆర్‌సీపీలోకి వచ్చారు. లోటస్‌పాండ్‌లో జరిగిన కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ కండువాలతో వీరిని సాదరంగా ఆహ్వానించారు. నటులు పృథ్వి, కృష్ణుడు ఆధ్వర్యంలో వీరంతా వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. జయశ్రీ, పద్మరేఖ, ఆశ, ప్రిద్విక, మీనాక్షి తేజస్విని తదిరులు  వైయ‌స్ఆర్‌సీపీలో చేరిన వారిలో ఉన్నారు.

ఈ సందర్భంగా పృథ్వి మాట్లాడుతూ... సీఎం చంద్రబాబు చివరికి దోచుకోవడానికి ఏమిలేక ఓట్లు కూడా దోచుకుంటున్నారని ఆరోపించారు. వీధి నాటకాల ద్వారా టీడీపీ అరాచకాలను ప్రజలకు తెలియజేస్తామన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top