ఈఎస్‌ఐ స్కాంలో రూ.300 కోట్ల అవినీతి

 కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం
 

కాకినాడ: చంద్రబాబు హయాంలో ఈఎస్‌ఐ స్కాంలో రూ.300 కోట్ల అవినీతి జరిగిందని ఆంధ్రప్రదేశ్‌ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. మాజీ కార్మిక మంత్రులు అచ్చెం నాయుడు, పితాని సత్యనారాయణ హయాంలోనే ఈ అవినీతి జరిగిందని పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వంలో ఎన్ని శాఖలుంటే అన్ని శాఖలను టీడీపీ దోచుకుంటుందని విమర్శించారు. దీంతో నేడు చంద్రబాబు కూడా ముద్దాయి అయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. ఇక బాబుతోపాటు అప్పటి కార్మికశాఖ మంత్రులిద్దరూ కూడా జైలుకు వెళ్లే పరిస్థితి దగ్గర్లోనే ఉందని పేర్కొన్నారు.

Back to Top