జనసేన కార్పొరేటర్ అభ్యర్ధి వైయ‌స్ఆర్ సీపీలో చేరిక‌

విశాఖ‌:  న‌గ‌రంలోని సుజాతానగర్ 79వ వార్డు జనసేన కార్పొరేటర్ అభ్యర్ధి కింటాడ ఈశ్వర్ రావు వైయ‌స్ఆర్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే అదీప్ రాజ్ సమక్షం లో ఈశ్వ‌ర్‌రావు వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. ఆయ‌న‌తో పాటు ప‌లువురు జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌కు అదీప్‌రాజ్ పార్టీ కండువాలు క‌ప్పి వైయ‌స్ఆర్‌సీపీలోకి సాద‌రంగా  ఆహ్వానించారు.  విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయ‌స్సార్సీపీ  నేతలు పోరాడుతుంటే.. పవన్ కల్యాణ్ కనీసం నోరెత్తలేకపోవడం తో జనసేనను వీడుతున్నామ‌ని ఈశ్వ‌ర్ రావు పేర్కొన్నారు.  సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సంక్షేమ ప‌థ‌కాలకు ఆక‌ర్శితుల‌మై వైయ‌స్ఆర్‌సీపీలో చేరిన‌ట్లు తెలిపారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top