సత్తెనపల్లిలో జనమాల

ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ రోడ్‌షోకు పోటెత్తిన జనం

ప‌ల్నాడు:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన మేమంతా సిద్ధం బ‌స్సు యాత్ర జైత్ర‌యాత్ర‌లా సాగుతోంది. ప‌ల్నాడు జిల్లా స‌త్తెన‌ప‌ల్లిలో వైయ‌స్ జ‌గ‌న్‌కు స్థానికులు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు.  బస్సుయాత్రలో వస్తున్న ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌కు భారీ గ‌జ‌మాల‌తో అపూర్వ స్వాగతం ప‌లికారు. సత్తెనపల్లి ప్రధానరహదారి జనంతో కిక్కిరిసింది. జ‌న‌నేత‌కు  అడుగడుగునా మహిళలు నీరాజనం ప‌లికారు

సత్తెనపల్లికి దాదాపు రెండు కిలోమీటర్ల ముందే బారులు తీరిన జనం.
సత్తెనపల్లి మెయిన్‌రోడ్‌కి ఇరువైపులా సీఎం కోసం బారులు తీసిన మహిళలు, అవ్వాతాతలు, అన్నదాతలు.

గుమ్మడి కాయలు, హారతితో దిష్టితీసి ముఖ్యమంత్రికి ఆత్మీయ స్వాగతం పలికిన మహిళలు.

దారిపొడువునా  అన్న మళ్లీ నువ్వే వస్తావ్‌.. ప్లకార్డులు ప్రదర్శించిన  అభిమానులు.

సీఎం వైయస్‌.జగన్‌తో పాటు సత్తెనపల్లిలో కదిలిన జనప్రవాహం.

Back to Top