మా కుటుంబానికి వైయస్‌ఆర్‌ దేవుడు

వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి జక్కంపూడి  విజయలక్ష్మీ
 
కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌గా జక్కంపూడి రాజా ప్రమాణం

 విజయవాడ : మా కుటుంబానికి దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి దేవుడని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శిజక్కంపూడి  విజయలక్ష్మీ  పేర్కొన్నారు.  చెప్పిన మాటను నెరవేర్చుకునే ఏకైక వ్యక్తి సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు.  కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌గా జక్కంపూడి రాజా ఆదివారం ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. ఆయన చేత కాపు కార్పొరేషన్‌ ఎండీ హరీంద్రప్రసాద్‌ ప్రమాణం చేయించారు. దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి, వైయస్‌ జగన్‌ తమ కుటుంబాన్ని వెన్నంటి ఆదుకున్నారని రాజా అన్నారు. ఆయన మాట్లాడుతూ..  ‘రాజకీయంగా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మమ్ముల్ని ఆదుకున్న వైయస్‌ జగన్, నన్ను ఆదరించి గెలిపించిన నియోజకవర్గ ప్రజలవల్లే నాకీ పదవి లభించింది. ఇప్పటికీ, ఎప్పటికీ వైఎస్‌ జగన్‌ వెంటే నడుస్తా. కాపుల సంస్కరణలను మంటకలిపిన వ్యక్తి చంద్రబాబు. కాపుల్ని అయోమయానికి గురిచేస్తూ రాజకీయ లబ్ది కోసం చంద్రబాబు నాటకాలాడారు. 

బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు న్యాయంచేస్తానని మా నాయకుడు సీఎం జగన్‌ స్పష్టంగా చెప్పారు. కాపు కార్పొరేషన్‌లో కొత్త సంస్కరణలు తీసుకువస్తాం. ప్రతి కాపు సోదరుడికి అండగా ఉంటాను. ప్రతి రూపాయి కాపులకు అందేలా చూస్తాం’అన్నారు. కాగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరొందిన జక్కంపూడి రామ్మెహన్‌ తనయుడే రాజా. ఆయన వైఎస్సార్‌సీపీ రాజానగరం ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కాపులకు ఇచ్చిన మాట ప్రకారం వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక తొలి బడ్జెట్‌లోనే రూ.2000 కోట్లు కాపు కార్పొరేషన్‌కు కేటాయించి కాపుల అభ్యున్నతికి తొలి అడుగు వేశారు. కార్యక్రమంలో మంత్రులు కన్నబాబు, బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, ఆళ్లనాని, ప్రభుత్వ విప్‌ దాడిశెట్టి రాజా, మాజీ కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కొత్తపల్లి సుబ్బారాయుడు  ఇతర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 

 కాపులు ఓసినో, బీసీనో బాబే చెప్పాలి: వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు 
విజయవాడ: గత టీడీపీ ప్రభుత్వం కాపులకు వెయ్యి కోట్లు ఇస్తామని చెప్పి..ఐదేళ్లలో రెండు వేల కోట్లు కూడా ఖర్చుచేయలేదని మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. శనివారం కాపు ఛైర్మన్‌ జక్కంపూడి రాజా ప్రమాణా స్వీకారోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ..ఢిల్లీ పర్యటనలు తప్ప..చంద్రబాబు కాపుల కోసం ఒక పని కూడా చేయలేదన్నారు. కాపులు ఓసినో, బీసీనో చెప్పలేని విధంగా  కాపులను చంద్రబాబు మోసం చేశారని ధ్వజమెత్తారు. సీఎం వైయస్‌ జగన్‌ కాపులకు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా పాటిస్తున్నారన్నారు. జక్కంపూడి రాజాను కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నియమించడం సీఎం వైయస్‌ జగన్‌ ఖచ్చితమైన నిర్ణయాలకు నిదర్శమని తెలిపారు. రాజకీయ,సామాజిక,విద్య,ఆర్థిక పరంగా కాపులను ఎదిగేలా చేస్తే కాపులు అన్ని రంగాల్లోనూ ముందుంటారని తెలిపారు. ఐక్యంగా ఉంటే అన్నీ సాధించుకోగలుగుతామన్నారు.

చంద్రబాబులా కాపులను మోసం చేయం: అబంటి 
కాపు కార్పొరేషన్‌కు పదివేల కోట్లు ఖర్చు చేయడానికి ౖవైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే అబంటి రాంబాబు అన్నారు. అన్నికార్పొరేషన్ల కన్నా కాపు కార్పొరేషన్‌ ఆర్థిక  పరిపుష్టి సంతరించుకుందన్నారు. కాపులను బీసీల్లోకి  చేరుస్తానని చెప్పిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేశారన్నారు.  దీంతో కాపులకు తీరని నష్టం కలిగిందన్నారు. మంజునాధ కమిషన్‌ నివేదిక వ్యతిరేకంగా ఉండటంతో .. కమిషన్‌ సభ్యుల రిపోర్టు కేంద్రానికి ఇచ్చేలా  చంద్రబాబు చేశారని మండిపడ్డారు. రెండు రిపోర్టులపై కేంద్రం అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు ప్రభుత్వం సమాధానమే ఇవ్వలేదన్నారు. చంద్రబాబు కాపులను నమ్మించి మోసం చేశారని..మా ప్రభుత్వం కాపులను మోసం చేయదన్నారు. కాపు సంక్షేమానికి ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు.
 
 

Back to Top