ఎమ్మెల్సీగా జంగా కృష్ణమూర్తి ఏకగ్రీవ ఎన్నిక

అమరావతి:  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున శాసన సభ్యుల కోటాలో ఎమ్మెల్సీ పదవికి నామినేషన్‌ దాఖలు చేసిన వైయస్‌ఆర్‌సీపీ బీసీ అధ్యాయన కమిటీ చైర్మన్‌ జంగా కృష్ణమూర్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత నెల 25న జంగా కృష్ణమూర్తి ఎమ్మెల్సీ పదవికి నామినేషన్‌ దాఖలు చేశారు.  ఈ మేరకు ఆయన్ను ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నిక చేసినట్లు శాసన సభ కార్యదర్శి సత్యనారాయణ ప్రకటించారు. కాగా, జంగాకృష్ణమూర్తికి వైయస్‌ఆర్‌సీపీ తరఫున వచ్చే ఏకైక ఎమ్మెల్సీ పదవిని బీసీ వర్గానికి  ఇస్తున్నట్లు ఇటీవల ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జన సభలో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మాట ఇచ్చారు. ఇచ్చిన మాట మేరకు జంగాను ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేలా వైయస్‌ జగన్‌ కృషి చేశారు. దీంతో బీసీ వర్గానికి చెందిన నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top