వైయస్‌ జగన్‌ గృహప్రవేశం శుభ సూచికం..

అమరావతి:నూతనంగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రంలోని  రాజకీయ పార్టీలలో  మొట్టమొదటి శాశ్వత కార్యాలయం వైయస్‌ఆర్‌సీపీదేనని వైయస్‌ఆర్‌సీసీ నేత పేర్ని నాని అన్నారు.ఐదు సంవత్సరాల నుంచి అమరావతి నిర్మాణం పేరుతో  తుమ్మచెట్లు, పొదలతో అడవిని చంద్రబాబు తయారుచేశారన్నారు. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై చంద్రబాబు, ఆయన పచ్చ మీడియా దుష్ఫప్రచారం చేస్తున్నాయన్నారు. వారి నోళ్లు మూయించేందుకు వైయస్‌ జగన్‌ అమరావతిలో సొంత ఇళ్లు,పార్టీ కార్యాలయం నిర్మించుకున్నారని తెలిపారు.రాబోయే రోజుల్లో వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నాయకత్వంలో అమరావతి శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు.అమరావతి అభివృద్ధికి వైయస్‌ జగన్‌ గృహప్రవేశం శుభసూచకమన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top