ఇంటింటా నీరాజనం

'జగనన్నే మా భవిష్యత్తు' కార్యక్రమానికి విశేష స్పంద‌న‌

'మా నమ్మకం నువ్వే జగన్' అంటూ ప్రజల నినాదాలు

అమ‌రావ‌తి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, సీఎం వైయ‌స్ జ‌గన్ మోహ‌న్ రెడ్డి పిలుపు మేర‌కు రాష్ట్ర‌వ్యాప్తంగా జ‌గ‌న‌న్నే మా భ‌విష్య‌త్ కార్య‌క్ర‌మం దిగ్విజ‌యంగా కొన‌సాగుతోంది.  ‘జగనన్నే మా భవిష్యత్‌.. మాకు భరోసా..’అని జనం ముక్తకంఠంతో చెబుతున్నారు. సంక్షేమం.. అభివృద్ధే రెండు కళ్లుగా సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సుపరిపాలన సాగిస్తున్నారు. ఆయన పథకాలతోనే తామంతా ఆర్థికాభివృద్ధి సాధించామని.. ఆయన్నే మళ్లీ సీఎంగా గెలిపించుకుంటామని ప్రజలు గొంతెత్తి చాటుతున్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా జగనన్నే మా భవిష్యత్తు, మా నమ్మకం నువ్వే జగన్‌ కార్యక్రమం బుధ‌వారం నిర్వహించారు. గృహ సార‌ధులు, స‌చివాల‌య క‌న్వీన‌ర్లు, వాలంటీర్లు, వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు ఇంటింటా లబ్ధిదారులను ప్రశ్నించి, వారి అభిప్రాయాలను సేకరించి, స్టిక్కర్లు అంటించారు.  

Back to Top