కాసేపట్లో ‘జగనన్న చేదోడు’ పథకం ప్రారంభం

తాడేపల్లి: కరోనా కష్టకాలంలోనూ సీఎం వైయస్‌ జగన్‌ సర్కార్‌ పేదలకు అండగా నిలుస్తోంది. సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. సంక్షేమ పథకాల అమలు క్యాలెండర్‌ విడుదల చేసిన సీఎం వైయస్‌ జగన్‌.. ఇచ్చిన మాట ప్రకారం ‘జగనన్న చేదోడు’ పథకాన్ని కాసేపట్లో ప్రారంభించనున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆన్‌లైన్‌ ద్వారా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ‘జగనన్న చేదోడు’ పథకాన్ని ప్రారంభించనున్నారు. షాపులున్న‌ రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు రూ.10 వేల చొప్పున ఆర్థికసాయాన్ని నేరుగా వాళ్ల బ్యాంక్‌ అకౌంట్లోకే జమ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,47,040 మంది లబ్ధిదారులకు రూ.247.04 కోట్ల ఆర్థికసాయాన్ని సీఎం వైయస్‌ జగన్‌ అందించనున్నారు. 

Back to Top