వైయస్‌ జగన్‌ ప్రజల మనిషి..

తిరుపతి: సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ,భరోసానిస్తూ వైయస్‌ జగన్‌ ప్రజల మనసు గెలుచుకున్నారని వైయస్‌ఆర్‌సీపీ నేత కాటసాని రాంభూపాల్‌ రెడ్డి అన్నారు. తిరుపతిలో గురువారం మీడియాతో మాట్లాడుతూ నవరత్నాలు పథకాలతో రాబోయే రోజుల్లో అద్భుతమైన పాలన అందించబోతున్నారన్నారు. వాగ్దానాలు నెరవేర్చలేకపోతే పదవి నుంచి దిగిపోతానని ధైర్యంగా చెప్పిన నాయకుడు వైయస్‌ జగన్‌ ఒక్కరేనని అన్నారు. ఆ మాటే ప్రజల మనసు మెప్పించిందని.. మాట తప్పని..మడమ తిప్పని నాయకుడిగా ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించారన్నారు.

సంక్షేమ పాలన అందిస్తారు...

వైయస్‌ జగన్‌ ప్రజల మనిషి అని చిత్తూరు వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త జంగాలపల్లి శ్రీనివాసులు అన్నారు. 13 జిల్లాల్లో సుదీర్ఘ పాదయాత్ర చేసిన దేశంలోనే మొదటి వ్యక్తిగా వైయస్‌ జగన్‌ చరిత్ర సృష్టించారన్నారు. సుబిక్ష పాలన అందించిన దివంగత మహానేత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఫొటోలను ఇంటిలో పెట్టుకుని రాష్ట్ర ప్రజలు దేవునిగా పూజిస్తున్నారన్నారు. 14 నెలలు దాటి ప్రజలతో మేమకమైన వైయస్‌ జగన్‌..తండ్రికి మించిన తనయుడిగా సంక్షేమ పాలన అందిస్తారని తెలిపారు.

Back to Top