గడప గడపలో ‘జగనన్నే మా భవిష్యత్తు’ 

మాజీ మంత్రి కొడాలి నాని

టీడీపీకి వ‌చ్చే ఎన్నిక‌లే చివ‌రివి 

అర్హులంద‌రికీ సంక్షేమ ప‌థ‌కాలు అందించ‌డ‌మే ప్ర‌భుత్వ ల‌క్ష్యం

గుడివాడ‌:  ఏ ఇంటికి వెళ్లినా జ‌గ‌న‌న్నే మా భ‌విష్య‌త్ అంటున్నార‌ని మాజీ మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం నిర్వ‌హించి సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు తీరుపై ఆరా తీశారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకొని అక్క‌డిక్క‌డే ప‌రిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ..గత ఎన్నికల్లో 23 స్థానాలకు పరిమితమైన తెలుగుదేశం పార్టీ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జీరోకి పరిమితం కాబోతుందని, 175 స్థానాల్లో వైయ‌స్ఆర్‌ సీపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రజలు పట్టం కట్టంబోతున్నారని  అన్నారు.  గత తెలుగుదేశం ప్రభుత్వంలో దోచుకోవడం, పేదల సొమ్ము తినేయడమే పనిగా పెట్టుకున్నారని, ఏనాడు అభివృద్ధి చేసిన దాఖలాలు లేవన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పనిచేస్తున్నారన్నారు. జాతీయ మీడియా సర్వేల్లో 24 నుంచి 25 ఎంపీ సీట్లు వైయ‌స్ఆర్‌ సీపీకే వస్తాయని చెపితే.. ఒక ఎంపీకి రూ.కోటి ఇచ్చి సర్వే చేయించుకున్నారని చంద్రబాబు మాట్లాడుతున్నారని, బీజేపీకి 300 సీట్లు వస్తాయని చెప్పారని, అయితే రూ.300 కోట్లు ఇచ్చి మోదీ సర్వే చేయించుకున్నారా? అని ప్రశ్నించారు. ఇలా అన్ని రాష్ట్రాల్లో కోట్లు ఇచ్చి సర్వేలు చేయించుకున్నారా! చంద్రబాబు నాయుడుకి చిన్న మెదడు చితికిపోయి, మైండ్‌ పోయి లేనిపోని మాటలు మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం శాశ్వతంగా సమాధి అయిపోతుందనే ఆవేదనతో మాట్లాడుతున్నారన్నారు. వ‌చ్చే ఎన్నిక‌లే టీడీపీకి చివ‌రి ఎన్నిక‌ల‌ని చెప్పారు.  

పండుగ వాత‌వార‌ణంలో జ‌గ‌న‌న్నే మా భ‌విష్య‌త్‌
రాష్ట్ర‌వ్యాప్తంగా పండుగ వాతావ‌ర‌ణంలో జ‌గ‌న‌న్నే మా భ‌విష్య‌త్‌, జ‌గ‌న‌న్నే మా న‌మ్మ‌కం కార్య‌క్ర‌మాలు కొన‌సాగుతున్నాయి. వైయ‌స్ జ‌గ‌న్ సైన్యం ప్ర‌తి ఇంటికి వెళ్లి మెగా పీపుల్స్ స‌ర్వే చేస్తున్నారు. ఏ ఇంటికి వెళ్లినా మ‌ళ్లీ జ‌గ‌న‌న్నే ముఖ్య‌మంత్రి కావాల‌ని ఆకాంక్షిస్తున్నారు. మా మ‌ద్ద‌తు జ‌గ‌న‌న్న‌కే అని నిన‌దిస్తున్నారు.

 

 

 

 

 

Back to Top