రేపు విశాఖకు  సీఎం వైఎస్‌ జగన్‌మోహ‌న్‌రెడ్డి

శ్రీశార‌దా పీఠాన్ని సంద‌ర్శించ‌నున్న సీఎం

ముఖ్య‌మంత్రి హోదాలో తొలిసారిగా విశాఖ‌కు వైయ‌స్ జ‌గ‌న్

 విశాఖ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి విశాఖలో పర్యటించనున్నారు. రేపు ఉదయం పది గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన విశాఖకు బయల్దేరతారు. పెందుర్తి మండలం చిన్న ముషిరివాడలోని శ్రీ శారదా పీఠాన్ని వైఎస్‌ జగన్ సందర్శిస్తారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీని కలుసుకుని ఆశీర్వచనం తీసుకోనున్నారు. కాగా భీమిలీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్‌ సోమవారం ఉదయం శారదా పీఠాన్ని సందర్శించారు. ముఖ్యమంత్రి పర్యటన విషయమై స్వరూపానందేంద్ర స్వామీజీతో చర్చించారు. సనాతన పీఠాల ద్వారానే సమాజంలో శాంతి సౌభాగ్యాలు నెలకొంటాయన్నారు. 

 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top